Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Allu Sirish: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో

13 February 2026

Actress : చీరకట్టులో స్టన్నింగ్ ఫోజులతో గ్లామర్ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్.. ఎవరంటే..

13 February 2026

IND vs PAK: టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో తోపు ఎవరు?

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Musical Road: రోడ్డుపై కారు వెళ్తుంటే ‘జయహో’ సాంగ్.. ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్డు సిద్ధం!
తాజా వార్తలు

Musical Road: రోడ్డుపై కారు వెళ్తుంటే ‘జయహో’ సాంగ్.. ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్డు సిద్ధం!

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Musical Road: రోడ్డుపై కారు వెళ్తుంటే ‘జయహో’ సాంగ్.. ఇండియాలోనే తొలి మ్యూజికల్ రోడ్డు సిద్ధం!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

అది మనందరికీ ఇష్టమైన దేశభక్తి గీతం ‘జై హో’. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ముంబైలో కొత్తగా నిర్మించిన కోస్టల్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ‘మ్యూజికల్ రోడ్డు’గా మార్చారు. ప్రపంచంలోనే ఐదో రోడ్డుగా, మన దేశంలోనే మొదటి రోడ్డుగా రికార్డు సృష్టించబోతున్న ఈ మ్యాజికల్ హైవే విశేషాలు.. దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటో వివరంగా తెలుసుకుందాం..

నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్లే ముంబై కోస్టల్ రోడ్డు మార్గంలో ఈ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టారు. వాహనదారులు ప్రయాణించేటప్పుడు వారిలో స్ఫూర్తిని నింపడానికి, దేశభక్తిని చాటడానికి ‘జై హో’ పాటను ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మ్యూజికల్ రోడ్డును అధికారికంగా ప్రారంభించనున్నారు. ముంబై వాసుల రోజువారీ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

ఈ రోడ్డుపై సంగీతం ఎలా వినిపిస్తుందనే సందేహం రావడం సహజం. దీని కోసం రోడ్డు ఉపరితలంపై ప్రత్యేకమైన మ్యూజికల్ స్ట్రిప్స్‌ను అమర్చారు. కారు కిటికీలు పూర్తిగా మూసివేసినా సరే, వాహనం ఆ స్ట్రిప్స్‌పై నుంచి వెళ్తున్నప్పుడు వచ్చే ప్రకంపనలు కారు లోపల సంగీత స్వరాలను సృష్టిస్తాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. కారు వేగం గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల మధ్య ఉన్నప్పుడు మాత్రమే ‘జై హో’ ట్యూన్ స్పష్టంగా వినిపిస్తుంది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి హంగేరీ దేశానికి చెందిన ఒక ప్రముఖ కంపెనీని బీఎంసీ నియమించింది.

సంగీతంతో కూడిన వినోదం..

ముంబై కోస్టల్ రోడ్డు ఇప్పటికే ట్రాఫిక్ లేని వేగవంతమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచింది. ఇప్పుడు ఈ మ్యూజికల్ ఫీచర్ తోడవ్వడంతో ఇది ముంబై నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా మారబోతోంది. టెక్నాలజీ మరియు వినోదాన్ని మేళవించి చేసిన ఈ ప్రయోగం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రధాన నగరాల్లో ఇలాంటి మ్యూజికల్ రోడ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.6.21 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మ్యూజికల్ రోడ్డు రాబోతుందనే విషయాన్ని తెలియజేయడానికి రహదారిపై 500 మీటర్లు, 100 మీటర్లు మరియు 60 మీటర్ల ముందే ప్రత్యేక సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనివల్ల డ్రైవర్లు అప్రమత్తమై నిర్ణీత వేగంతో ప్రయాణించి ఆ సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రయాణాలు కేవలం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడం మాత్రమే కాకుండా.. ఒక మధురమైన జ్ఞాపకంగా మారుతున్నాయి. ముంబై వెళ్లే పర్యాటకులు ఈ జై హో ట్యూన్‌ను మిస్ అవ్వకుండా ఉండాలంటే కోస్టల్ రోడ్డుపై డ్రైవ్ చేయాల్సిందే.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Allu Sirish: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో

13 February 2026

Actress : చీరకట్టులో స్టన్నింగ్ ఫోజులతో గ్లామర్ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్.. ఎవరంటే..

13 February 2026

IND vs PAK: టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో తోపు ఎవరు?

13 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Allu Sirish: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో

13 February 2026

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ అయ్యింది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు…

Actress : చీరకట్టులో స్టన్నింగ్ ఫోజులతో గ్లామర్ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్.. ఎవరంటే..

13 February 2026

IND vs PAK: టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో తోపు ఎవరు?

13 February 2026

అమ్మాయిలూ.. తలలో పేలు పోవడం లేదా.. అయితే, ఈ నేచురల్ టిప్స్ తో శాశ్వతంగా తరిమికొట్టండి!

13 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Allu Sirish: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో

13 February 2026

Actress : చీరకట్టులో స్టన్నింగ్ ఫోజులతో గ్లామర్ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్.. ఎవరంటే..

13 February 2026

IND vs PAK: టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డుల్లో తోపు ఎవరు?

13 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.