Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన

16 February 2026

క్యూట్ క్యూట్ ఫొటోలతో మతిపోగొడుతున్న కృతి శెట్టి.. చూపు తిప్పుకోలేకపోతున్న కుర్రాళ్లు

16 February 2026

Viral Video: ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కొండచిలువ.. గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌.. వీడియో వైరల్

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Job Card In Just 48 Hours,ఏపీ ప్రజలకు శుభవార్త.. పూర్తిగా ఉచితం.. ఇకపై 48 గంటల్లోనే ఆ కార్డు చేతికి ఇస్తారు – andhra pradesh mgnrega workers will get new job card within 48 hours
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Job Card In Just 48 Hours,ఏపీ ప్రజలకు శుభవార్త.. పూర్తిగా ఉచితం.. ఇకపై 48 గంటల్లోనే ఆ కార్డు చేతికి ఇస్తారు – andhra pradesh mgnrega workers will get new job card within 48 hours

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Job Card In Just 48 Hours,ఏపీ ప్రజలకు శుభవార్త.. పూర్తిగా ఉచితం.. ఇకపై 48 గంటల్లోనే ఆ కార్డు చేతికి ఇస్తారు – andhra pradesh mgnrega workers will get new job card within 48 hours
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP GJob Card 48 Hours
ఏపీ జాబ్‌కార్డు 48 గంటల్లోనే(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొత్త జాబ్ కార్డు ఇకపై వేగంగా జారీ చేస్తారు. కేంద్రం ఇటీవల ఉపాధి హామీ పథకానికి సంబంధించి మార్పులు చేసింది. MGNREGA (మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పేరును VBGRAMG (వికసిత్‌ భారత్‌ గ్రామీణ రోజ్‌గార్‌ మిషన్‌)గా మార్చిన సంగతి తెలిసిందే. ఇక ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా కూలీల మస్టర్ (హాజరు) నమోదు చేస్తోంది. అలాగే ఒక్క కుటుంబానికి పని దినాలు 125 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే. వేతనాలను కూడా త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ వేతనాల చెల్లింపులు ఆలస్యం అయితే పరిహారం అందిస్తారు.

ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు ఖర్చు చేస్తాయి. అయితే ఉపాధి హామీకి సంబంధించి జాబ్ కార్డు ఉంటుంది. అయితే ప్రజలకు కొత్త జాబ్‌కార్డు జారీ విధానాన్ని కేంద్రం మరింత సులభతంర చేసింది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే జాబ్ కార్డును జారీ చేయనున్నారు. ఒకవేళ ఎవరికైనా జాబ్ కార్డు కావాలవంటే ఆయా గ్రామాల్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. జాబ్ కార్డు కోసం ఈకేవైసీ పూర్తి చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత అధికారులు నిర్దేశిత సమయంలో జాబ్ కార్డు జారీ చేస్తారు.

జాబ్ కార్డులు ఉన్న ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. అలాగే ఉపాధి పనుల కోసం వచ్చిన కూలీలు కచ్చితంగా ఫేస్ రికగ్నేషన్ ద్వారా (ముఖ ఆధారిత) హాజరు వేయాల్సిందే. గతంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి అవకతవకలు జరిగాయి. కొందరు ఒకటి రెండు చోట్ల పేర్లను నమోదు చేయించుకున్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు పనికి వెళ్లేవారు. అసలు పనికి రాకపోయినా సరే కొందరు మస్టర్లు వేశారు. ఇలా ఎన్నో లోటుపాట్లను గుర్తించిన తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్రం ఆదేశాలతో ముఖ ఆధారిత హాజరును నమోదు చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ విధానం అమల్లో ఉన్నా.. మార్చి తర్వాత పూర్తిగా అమల్లోకి తీసుకొస్తారని చెబుతున్నారు. అప్పుడు ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు అంటున్నారు. మొత్తం మీద ఉపాధి హామీ పథకంలో మార్పులతో పాటుగా జాబ్ కార్డుని వేగంగా జారీ చేస్తారు.. అదే సమయంలో హాజరు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఎవరికైనా జాబ్ కార్డులు కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి