Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Eggs Side Effects: వీరికి గుడ్డు విషంతో సమానం.. తిన్నారో స్లో పాయిజన్‌లా మారుతుంది!

16 February 2026

రూ.30 వేల జీతంలో రూ.10 వేల పొదుపు సాధ్యమేనా? ఈ ప్లాన్‌ పాటించండి.. రూ.10 వేలు మిగులుతాయి!

16 February 2026

Kirak Rp Sorry Botsa Satyanarayana,తీవ్రంగా చింతిస్తున్నా.. బొత్స సత్యనారాయణకు కిరాక్ ఆర్పీ క్షమాపణలు, మళ్లీ ట్విస్ట్.. – kirak rp sorry to ysrcp leader botsa satyanarayana

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kirak Rp On Botsa Satyanarayana,2029లో ఆలయాల ముందు అడుక్కు తింటావ్.. కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్ – ysrcp naga malleswari on kirak rp comments on botsa satyanarayana
ఆంధ్రప్రదేశ్

Kirak Rp On Botsa Satyanarayana,2029లో ఆలయాల ముందు అడుక్కు తింటావ్.. కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్ – ysrcp naga malleswari on kirak rp comments on botsa satyanarayana

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kirak Rp On Botsa Satyanarayana,2029లో ఆలయాల ముందు అడుక్కు తింటావ్.. కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్ – ysrcp naga malleswari on kirak rp comments on botsa satyanarayana
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు, అనుకరణ వివాదాస్పదమైంది. కిరాక్ ఆర్పీ తీరుపై వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత నాగ మల్లేశ్వరి.. కిరాక్ ఆర్పీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని.. లేకపోతే 2029 తర్వాత వైసీపీ కార్యకర్తలు తొక్కిపట్టి నార తీస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Kirak rp
కిరాక్ ఆర్పీకి వైసీపీ నేత వార్నింగ్(ఫోటోలు– Samayam Telugu)
కమెడియన్, టీడీపీ మద్దతుదారుడు కిరాక్ ఆర్పీ మీద వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి, వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అనుకరిస్తూ కిరాక్ ఆర్పీ మాట్లాడిన మాటలు, తీరుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. కిరాక్ ఆర్పీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగ మల్లేశ్వరి .. కిరాక్ ఆర్పీపై విరుచుకుపడ్డారు. కిరాక్ ఆర్పీకి వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకుంటే 2029లో ఆలయాల ముందు అడుక్కుతినే రోజులొస్తాయంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

” కిరాక్ ఆర్పీ.. ఒళ్లు బలిసి మాట్లాడుతున్నావ్. ఎవరిని పడితే వాళ్లను, ఏదిపడితే అది మాట్లాడుతున్నావ్. కాస్త ఒళ్లూ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. లోపాలుంటే చెప్పటంలో తప్పులేదు. కానీ వ్యక్తిలోని లోపాన్ని అవహేళన చేస్తూ నువ్వు చేస్తున్న యాక్టింగ్, రాబోయే రోజులలో నీకు ప్రాక్టీస్ అవుతుంది. బొత్స గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా. ఆయన చిటికెన వేలి మీద ఉన్న వెంట్రుకతో కూడా నువ్వు సమానం కాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా నీ గురించి ఎందుకులే అనుకున్నా. కానీ చాలా శ్రుతిమించిపోయావ్. జాగ్రత్త.”

“ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తే సొరకు ఎరేసినట్లు వేసేస్తారు. ఎవరిని చూసి మాట్లాడుతున్నావ్. కోటీ 32 లక్షల మంది తొక్కిపట్టి నార తీసే రోజు వస్తుంది. కంట్రోల్‌గా ఉండు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే బాగుంటుంది. మరోసారి వైసీపీ నేతలపై ఇష్టానుసారం మాట్లాడితే.. ఇప్పుడు చేసే యాక్టింగ్ నిజమవుద్ది. ఏ గుళ్ల ముందో, రైల్వేస్టేషన్ల ముందో, బస్టాండ్ల వద్దో అడుక్కుంటావ్.. నోరు, ప్రవర్తన అదుపులో పెట్టుకో.” అంటూ వైసీపీ నేత నాగ మల్లేశ్వరి వార్నింగ్ ఇచ్చారు.

అయితే కిరాక్ ఆర్పీ మాట్లాడిన మాటలపై సోషల్ మీడియా వేదికగానూ వైఎస్సా్ర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ అండతో ఇష్టానుసారం పేట్రేగి మాట్లాడుతున్నారని.. 2029 ఎన్నికల తర్వాత అసలు సినిమా చూపిస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. సీనియర్ రాజకీయ నేతపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు తగదని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తంగా కిరాక్ ఆర్పీ వ్యవహారంతో సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి