శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన 2018 సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన 67కు పైగా పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం ఏప్రిల్ 7వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ కేసును విచారించనుంది. ఈ విషయంలో కేవలం శబరిమల ఆలయమే కాకుండా, దేశవ్యాప్తంగా వివిధ ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాలపై కూడా సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. నిషేధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తూ మార్చి 14వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. విశ్వాసాలు ఒకటే అయినప్పుడు వివక్ష ఎందుకు అనే అంశంపై ధర్మాసనం ప్రధానంగా దృష్టి సారించనుంది. మతపరమైన ఆచారాలు, మహిళల సమానత్వ హక్కుల మధ్య ఉన్న సంఘర్షణను ఈ ధర్మాసనం రాజ్యాంగబద్ధంగా పరిశీలించనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నన్నయ యూనివర్సిటీలో సెగలు రేపుతున్న విద్యార్థుల ఆందోళన.. అసలు ఏం జరిగింది
Deputy CM Pawan Kalyan: పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే ముఖ్యం
మొన్న తారక్.. త్వరలో మహేష్.. వారిద్దరికీ అక్కడేం పని
హిట్‌కీ, అవకాశాలకీ లింక్ లేదంటున్న లేడీస్.. ఇక్కడ దమ్ముండాలి
టాలీవుడ్‌లో దాని ప్రభావం బాగా ఉంది భయ్యా.. భారీగా మారుతున్న చిన్న సినిమాలు

