బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. రెండు సార్లు ( బిగ్ బాస్ నాన్ స్టాప్-2022, బిగ్ బాస్ సీజన్ 7-2023) ఈ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. విజేతగా నిలవకున్నా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టీవీ షోస్, సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తెలుగులో బిజీయెస్ట్ యాంకర్ గా ఉన్న స్రవంతి సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హే బలవంత్ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో సుహాస్, శివానీ నాగారం హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చిందీ స్టార్ యాంకర్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో ఓ అర్ధరాత్రి 12 గంటలకు ఓ హీరో కాల్ చేసి మాట్లాడాడంటూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది.
‘ నేను ఇటీవల ఒక సినిమా ఈవెంట్ చేశాను. కొన్ని కారణాల వల్ల ఆ ఈవెంట్ బాగా లేట్ అయింది. ఈవెంట్ అయ్యాక రాత్రి 12 గంటల సమయంలో ఆ సినిమా హీరో నాకు ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టాడు. ఫ్రీ గా ఉన్నప్పుడు కాల్ చేయండి అని అందులో పేర్కొన్నాడు. దీంతో నాకు భయమేసింది. ఆ హీరో గురించి నేను ఏం తప్పు మాట్లాడలేదు కదా అని కంగారు పడ్డాను. ఈవెంట్ బాగానే చేశాను కదా అని మనసులో గట్టిగ అనుకున్నా. సరే అని నా నంబర్ మెసేజ్ పెట్టి రేపు కాల్ చేస్తాను అని చెప్పాను. కానీ నెంబర్ పెట్టిన వెంటనే ఆయన కాల్ చేసారు’
ఇవి కూడా చదవండి
యాంకర్ స్రవంతి లేటెస్ట్ ఫొటోస్..
‘నేను లిఫ్ట్ చేయగానే ‘ మీరు మా సినిమా ఈవెంట్ చాలా బాగా హ్యండిల్ చేసారు. నేను మొదట్లో చూసిన స్రవంతికి ఇప్పుడు చూసే స్రవంతి చాలా మారింది. మిమ్మల్ని, మీ వర్క్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాయలసీమ నుంచి అక్కడ నుంచి వచ్చిన అమ్మాయిలు ఇలా సక్సెస్ అయిన వాళ్లు చాలా తక్కువ అని అన్నారు. అలా ఆయన చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. మనం బాగున్నాం అనే దాని కంటే మన వర్క్ బాగుందని పొగడటంతో ఫుల్ హ్యాపీ అనిపించింది’ అని చెప్పుకొచ్చింది స్రవంతి. అయితే హీరో పేరు మాత్రం చెప్పను అని ట్విస్ట్ ఇచ్చిందీ అందాల యాంకరమ్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

