Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. ఈ చిన్న టెక్నిక్‌తో చెక్ పెట్టండి..

24 February 2026

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

24 February 2026

హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chandrababu Presentation Tirumala Laddu Assembly,కల్తీ నెయ్యితో రూ.20 కోట్ల లడ్డూలు.. అసెంబ్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ – ap cm chandrababu presentation on tirumala laddu adulterated ghee issue in assembly
ఆంధ్రప్రదేశ్

Chandrababu Presentation Tirumala Laddu Assembly,కల్తీ నెయ్యితో రూ.20 కోట్ల లడ్డూలు.. అసెంబ్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ – ap cm chandrababu presentation on tirumala laddu adulterated ghee issue in assembly

.By .24 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chandrababu Presentation Tirumala Laddu Assembly,కల్తీ నెయ్యితో రూ.20 కోట్ల లడ్డూలు.. అసెంబ్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ – ap cm chandrababu presentation on tirumala laddu adulterated ghee issue in assembly
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ రిపోర్టు పంపించిందన్న చంద్రబాబు.. అందుకే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు దోషులు ఎవరైనా శిక్ష పడాలని పవన్ కళ్యాణ్ కోరారు.

Chandrababu
అసెంబ్లీలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజంటేషన్(ఫోటోలు– Samayam Telugu)
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం లఘు చర్చ నిర్వహించారు. ఈ చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలను తయారు చేశారని అన్నారు. నిపుణులు, అధికారులతో కలిసి అందరూ కుట్రలు చేశారని చంద్రబాబు విమర్శించారు. మహాపాపం పేరుతో లడ్డూ కల్తీ జరిగిన తీరును అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

ఈ విషయంలో రాజకీయ వివాదం ఉండకూడదనే ఉద్దేశంతో సెట్ ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. సుప్రీంకోర్టు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. సీబీఐ సెట్ కూడా తప్పుచేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపించిందని వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు.

మరోవైపు తిరుమల లడ్డూనే కాకుండా అనే విషయాల్లో గతంలో తప్పులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 59.71లక్షల లీటర్ల మేరకు కల్తీ నెయ్యి వినియోగించారని చంద్రబాబు ఆరోపించారు. రూ.231.51 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని శాసనసభలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయిన తర్వాత కూడా రిపోర్టును తొక్కిపెట్టారంటూ వైసీపీపై విమర్ళలు గుప్పించారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టునే తాను చదివానన్న చంద్రబాబు.. ఆ భగవంతుడే తనతో చెప్పించాడని శాసనసభలో అన్నారు.

దోషులు ఎవరైనా శిక్ష పడాల్సిందే..

మరోవైపు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులకు తప్పకుండా శిక్షపడాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. లఘు చర్చలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఈ వ్యవహారంలో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాలని అన్నారు. జంతు సంబంధిత రసాయనాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పిందన్న పవన్ కళ్యాణ్.. అసలు నెయ్యే కాదని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చిందన్నారు. కల్తీనెయ్యిలో ఏ కెమికల్స్ వాడారనేదీ ఆ పెరుమాళ్లకే తెలియాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి