గుంటూరు నగరంలోని బృందావన గార్డెన్స్ ఒక ముఖ్యమైన కూడలి.. ఈ ప్రాంతంలో ఉన్నత వర్గాల వారు, ప్రముఖులు నివసిస్తుంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. గార్డెన్స్ లోని ఒక నిర్మానుష్య ఏరియాలో కొంతమంది ఆకతాయిలు చేరి అల్లరి చేస్తున్నారు. ప్రతి రోజూ ఇదే తంతు కొనసాగుతోంది. ఆకతాయిలు అల్లరి స్థానికులకు ఇబ్బందిగా మారింది. గంజాయి సేవిస్తున్నట్లు స్థానికం అనుమానించారు. దీంతో ఆకతాయిలు అల్లరి, గంజాయి సేవించడంపై స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫోన్ చేసి చెప్పారు. ఆకతాయిలు అల్లరి స్థానికులకు న్యూసెన్స్ గా మారిన విషయాన్ని చెప్పేశారు. ఇక అంతటితో తమ పని అయిపోయిందని స్థానికులు గమ్మనుండిపోయారు.
అయితే ఫోన్ చేసిన పది నిమిషాలకే గల్లా మాధవి ఆ స్థలంలో వాలిపోయారు. బైక్ పై సర్రున దూసుకొస్తున్న ఎమ్మెల్యే ను చూసిన ఆకతాయిలు అక్కడి నుండి పారిపోయారు. ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వచ్చిన విషయం క్షణాల్లోనే చేరిపోయింది. దీంతో ఎమ్మెల్యే కి ఫోన్ చేసిన మహిళా వచ్చి.. ఆకతాయిలు ఆట కట్టించాలని చెప్పింది. ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నిఘా పెట్టాలని సూచించింది. గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించింది.
వీడియో చూడండి..
ఫోన్ కాల్ కే స్పందించి వచ్చిన ఎమ్మెల్యే ను స్థానికులు అభినందించారు. గతంలోనూ పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో నిర్మానుష ప్రాంతానికి పోలీసులతో వెళ్ళి పేకాట రాయుళ్లు, గంజాయి ముఠాని పట్టించారు. సమస్యలున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆమె స్పందిస్తున్న తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

