Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs ZIM: ప్రపంచ కప్ హిస్టరీలోనే భారత్ భారీ స్కోర్.. అగ్రస్థానంలో ఏ జట్టుందో తెలుసా?

26 February 2026

Nara Lokesh: చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్

26 February 2026

ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే రూ.1.25 లక్షల లోన్‌! ఎలా పొందాలంటే..?

26 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»PM Modi: రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
జాతీయం

PM Modi: రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

.By .26 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
PM Modi: రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. ఇజ్రాయెల్ గడ్డపై మోదీ చేసిన ప్రసంగం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. ఇజ్రాయెల్ – భారత్ బంధం ఎన్ని కష్టాలు, అవాంతరాలు వచ్చిన చెక్కుచెదరనిది అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. తనకు లభించిన అత్యున్నత స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్ గురించి ప్రస్తావిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ పురస్కారం నా ఒక్కడిది కాదు.. ఇది 140 కోట్ల భారతీయుల గౌరవానికి చిహ్నం. దీనిని భారతదేశం-ఇజ్రాయెల్ స్నేహానికి అంకితం చేస్తున్నాను’’ అని ప్రకటించి అందరి మనసు గెలుచుకున్నారు.

రక్షణ నుంచి అంతరిక్షం వరకు

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, కీలక ఖనిజాల రంగంలో ఇరు దేశాలు గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతాయని మోదీ ఆకాంక్షించారు. పౌర అణుశక్తి, అంతరిక్ష పరిశోధన రంగాలలో రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. రక్షణ సంబంధాలు కేవలం కొనుగోలు, అమ్మకాలకు పరిమితం కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరుకున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేయబోతున్నట్లు మోదీ ప్రకటించారు.

ఇజ్రాయెల్‌లో భారత్ యూపీఐ మ్యాజిక్

భారతదేశ డిజిటల్ విప్లవ చిహ్నమైన UPI ఇకపై ఇజ్రాయెల్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఫిన్‌టెక్ రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి కుదిరిన ఈ ఒప్పందాన్ని మోదీ స్వాగతించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.

మన ఊర్లోకి ఇజ్రాయెల్ టెక్నాలజీ

భవిష్యత్తు సాంకేతికతదే అని నమ్మే మోదీ.. ఇజ్రాయెల్ యొక్క అత్యాధునిక సాంకేతికతను భారతదేశంలోని ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశం వ్యవసాయం, నీటి సంరక్షణలో ప్రపంచంలోనే నంబర్ 1. ఇప్పుడు ఆ టెక్నాలజీని మన దేశంలోని ప్రతి గ్రామానికి తీసుకురావాలని మోదీ నిర్ణయించారు. దీనివల్ల మన రైతులకు మేలు జరుగుతుంది మరియు స్మార్ట్ గ్రామాలు తయారవుతాయి.

ఉగ్రవాదంపై పోరు

శాంతికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెబుతూనే, ఉగ్రవాదంపై మోదీ గట్టిగా స్పందించారు. ‘‘ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. దీనికి వ్యతిరేకంగా భారత్, ఇజ్రాయెల్ కలిసి పోరాడతాయి’’ అని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి, గాజా శాంతి ప్రక్రియ అందరి శ్రేయస్సు కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

నెతన్యాహు భావోద్వేగ ప్రసంగం

ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో మోదీ చేసిన ప్రసంగం ఇజ్రాయెల్ ప్రజల గుండెలను హత్తుకుందని, అది విన్నప్పుడు ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ప్రెస్ మీట్ మధ్యలో నెతన్యాహు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. “నేను నా భార్య సారాను మొదటిసారి కలిసినప్పుడు, మా మొదటి లేదా రెండవ డేటింగ్ టెల్ అవీవ్‌లోని ఒక ఇండియన్ రెస్టారెంట్‌లో జరిగింది. అప్పుడే ఆమెకు భారతీయ ఆహారం పరిచయం అయ్యింది. ఆ డేట్ మాకు చాలా ప్రత్యేకం” అంటూ భారతదేశంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

PM Modi: ఇజ్రాయెల్‌తో భారత్ కీలక ఒప్పందం.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

26 February 2026

TN Elections 2026: తమిళనాట చిన్నమ్మ కొత్త పార్టీ.. మద్ధతు ఎవరికంటే..?

26 February 2026

20 ఏళ్ల స్నేహానికి గుర్తుగా.. అరుదైన పుష్పానికి మోదీ పేరు.. దీని గురించి మీకు తెలుసా?

26 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs ZIM: ప్రపంచ కప్ హిస్టరీలోనే భారత్ భారీ స్కోర్.. అగ్రస్థానంలో ఏ జట్టుందో తెలుసా?

26 February 2026

India Highest Ever T20 World Cup Total: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన…

Nara Lokesh: చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్

26 February 2026

ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే రూ.1.25 లక్షల లోన్‌! ఎలా పొందాలంటే..?

26 February 2026

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త.. త్వరలో మరిన్ని సిద్దం..

26 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs ZIM: ప్రపంచ కప్ హిస్టరీలోనే భారత్ భారీ స్కోర్.. అగ్రస్థానంలో ఏ జట్టుందో తెలుసా?

26 February 2026

Nara Lokesh: చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్

26 February 2026

ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే రూ.1.25 లక్షల లోన్‌! ఎలా పొందాలంటే..?

26 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.