హైదరాబాద్ నగరంలో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫ్లైఓర్లలో పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే కూడా ఒకటి. రోజే ఈ రహదారిపై కొన్ని వేల కొద్ది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే పై తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న ర్యాంపుల వద్ద కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ పనుల కోసం ఈ-ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో టెండర్లను పిలవాలని నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించి దాదాపు 20 ఏళ్లు కావోస్తొండడంతో అక్కడక్కడ కాస్తా గోతులు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ గుంతల కారణంగా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇవే కాదు కొన్ని వాహనాలు నిబంధనలు విరుద్దంగా అతివేగంతో ప్రయాణించి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇకపై వాటిని గుర్తించేందుకు ప్లైఓవర్‌పై స్పీడ్ కెమెరాస్ ఏర్పాటు చేయాలని హెల్‌ఎమ్‌డీఏ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వీటన్నింటిని క్లియర్ చేసి ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించాలని యోచిస్తోంది.
ఇదే కాకుండా నగరంలోని మరికొన్ని ప్లైఓర్లును కూడా మరమ్మత్తులు చేయాలని HMDA ఆలోచిస్తోంది. వీటికి కూడా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. వాటిలో బుద్వేల్ లేఅవుట్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రేడియల్ రోడ్డు-2ను కలుపుతూ నిర్మిస్తున్న ఇంటర్ ఛేంజ్ కోసం కన్సల్టెన్సీలను కోసం కూడా టెండర్లు పిలిచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

