India vs West Indies Result, T20 World Cup 2026: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు విండీస్ జట్టుపై ఉత్కంఠ విజయం సాధించింది.195 పరుగుల ఛేజింగ్‌ను భారత జట్టు 5వికెట్లు కోల్పోయి ఛేదించింది. శాంసన్ కీలక మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టకున్నాడు. దీంతో భారత జట్టు సెమీస్ చేరుకుంది. సెమీస్‌లో ఇంగ్లాండ్ జట్టుతో మార్చి 5న వాంఖడే స్టేడియంలో ఆడనుంది. ఇక తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ జట్టుతో సౌతాఫ్రికా టీం ఆడనుంది.
మ్యాచ్ పరిస్థితి..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ 40 పరుగులు, జాసన్ హోల్డర్ అజేయంగా 37 పరుగులు చేశాడు. భారత జట్టు తరపున బుమ్రా 2 వికెట్లు, వరుణ్, హార్దిక్ తలో వికెట్ పడగొట్టారు.
ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డే, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

