Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? ఈ సూపర్ టిప్స్ మీకోసం..!

3 March 2026

Thalapathy Vijay: దళపతి విజయ్‌తో విడాకులు.. భరణంగా సంగీతకు ఎన్ని కోట్లు రానున్నాయంటే?

3 March 2026

Bank Holiday: హోలీ సెలవు మారిందా..? బుధవారం బ్యాంకులు మూసి ఉంటాయా?

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Railway Job Scam: పెద్ద ప్లానింగే.. రైల్వే కొలువు కోసం స్టూడెంట్‌కి బదులు పరీక్ష రాసిన టీచర్‌..! ఆ తర్వాత సీన్ ఇదే
తాజా వార్తలు

Railway Job Scam: పెద్ద ప్లానింగే.. రైల్వే కొలువు కోసం స్టూడెంట్‌కి బదులు పరీక్ష రాసిన టీచర్‌..! ఆ తర్వాత సీన్ ఇదే

.By .3 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Railway Job Scam: పెద్ద ప్లానింగే.. రైల్వే కొలువు కోసం స్టూడెంట్‌కి బదులు పరీక్ష రాసిన టీచర్‌..! ఆ తర్వాత సీన్ ఇదే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


జబల్పూర్, మార్చి 3: గూగుల్‌లో ఫోటోలను ఎడిట్ చేసి నకిలీ పత్రాలను తయారు చేసి.. వీటి రైల్వే శాఖకే పంగనామాలు పెట్టారు ఇద్దరు వ్యక్తులు. రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాల రాత పరీక్షలో నిజమైన అభ్యర్థి స్థానంలో నకిలీ వ్యక్తి పరీక్ష రాశాడు. అందుకు రూ.6 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. రాత పరీక్ష నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల వరకు నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించారు. సెప్టెంబర్ 2025లో విధుల్లో చేరిన తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో బొటనవేలు, ముఖం సరిపోలకపోవడంతో మొత్తం మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బీహార్ నుంచి వారిద్దరినీ అరెస్టు చేసి జబల్‌పూర్ కోర్టులో హాజరుపరిచింది. అక్కడి నుంచి వారిని జైలుకు తరలించారు.

2024 సంవత్సరానికి ఇండియన్ రైల్వే ఆల్ ఇండియా రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన టెక్నీషియన్ పోస్టులకు దాదాపు 8, 000 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. ముంగేర్ నివాసి ముఖేష్ కుమార్ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం స్థానికంగా ఉన్న ఓ కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్న రంజిత్‌కుమార్‌న్‌ ముఖేష్‌ సంప్రదించాడు. మొదట్లో ముఖేష్‌ అభ్యర్ధనను రంజీత్‌ నిరాకరించాడు. అయతే అతడు రూ.6 లక్షలు ఇస్తానని ఆశ చూపడంతో రంజిత్‌.. ముఖేష్ స్థానంలో పరీక్ష రాయడానికి అంగీకరించాడు. డిసెంబర్ 2024లో పాట్నాలో జరిగిన CBT పరీక్షలో రంజీత్ ముఖేష్‌గా హాజరై ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల కోసం అతన్ని భోపాల్‌కు పిలిపించారు. అక్కడ వైద్య పరీక్ష కోటా ఆసుపత్రిలో జరిగింది. జూలై 2025లో విడుదల చేసిన ప్యానెల్‌లో ముఖేష్ ఎంపికైనట్లు ఫలితాలు వచ్చాయి.

దీంతో జూలై 12, 2025న జరిగిన ఉద్యోగ మేళాకు హాజరై ఆ తర్వాత, అతను సెప్టెంబర్‌లో ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో దామోహ్, సాగర్, జబల్‌పూర్‌లలో కూడా పనిచేశాడు. తరువాత అక్టోబర్ 2025లో అతన్ని శిక్షణ కోసం ప్రయాగ్‌రాజ్‌కు పంపారు. ఇప్పటి వరకు అంతా సజావుగా జరిగినప్పటికీ నవంబర్ 2025లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో మొత్తం యవ్వారం బయటపడింది. రైల్వే నిబంధనల ప్రకారం కొత్త ఉద్యోగులకు ఏడాదిలోపు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. నవంబర్ 14న జరిగిన ఈ పరీక్ష సమయంలో బొటనవేలు, ముఖ గుర్తింపు సరిపోలలేదు. దీంతో అధికారుల్లో అనుమానాన్ని రేకెత్తించింది. దీంతో మోసం గుర్తించిన జబల్‌పూర్ విభాగం CBIకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 2, 2025న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మోసం బయపడటంతో ముఖేష్ ఎవరికీ తెలియజేయకుండా బీహార్ పరార్‌ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

అయితే నిందితుడు ముఖేష్‌ కాల్ వివరాలు, లొకేషన్ సమాచారం ఆధారంగా సీబీఐ టీం ముంగేర్‌కు చేరుకుని ముఖేష్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణలో అతను మొత్తం కుట్రను వెల్లడించాడు. దీంతో రంజీత్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెల్లడైంది. దరఖాస్తు ఫారమ్‌లో ఉపయోగించిన ఫోటో రెండు ఛాయాచిత్రాల మిశ్రమంగా ఉంది. అవసరమైతే అది పాత ఫోటో అని చెప్పి తప్పించుకోవచ్చని నిందితులు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బయోమెట్రిక్‌ టెస్ట్ వీరి మోసాన్ని బయటపెట్టింది. ఇందులో మాస్టర్ మైండ్‌ అయిన రంజీత్.. ఇలా ఇప్పటి వరకు ఎంత మందికి బదులుగా పరీక్షకు హాజరై ఉద్యోగాలు ఇప్పించాడనే దానిపై CBI దర్యాప్తు చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? ఈ సూపర్ టిప్స్ మీకోసం..!

3 March 2026

Thalapathy Vijay: దళపతి విజయ్‌తో విడాకులు.. భరణంగా సంగీతకు ఎన్ని కోట్లు రానున్నాయంటే?

3 March 2026

Bank Holiday: హోలీ సెలవు మారిందా..? బుధవారం బ్యాంకులు మూసి ఉంటాయా?

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? ఈ సూపర్ టిప్స్ మీకోసం..!

3 March 2026

జుట్టు రకమే ఏదైనా, ప్రతి ఒక్కరి తలస్నానం చేయడం చాలా ముఖ్యం. జుట్టు శుభ్రంగా ఉంచడం కేవలం సౌందర్య పరంగా…

Thalapathy Vijay: దళపతి విజయ్‌తో విడాకులు.. భరణంగా సంగీతకు ఎన్ని కోట్లు రానున్నాయంటే?

3 March 2026

Bank Holiday: హోలీ సెలవు మారిందా..? బుధవారం బ్యాంకులు మూసి ఉంటాయా?

3 March 2026

ప్రేమంటే ఇదేరా..? చనిపోయిన కోడి కోసం తల్లడిల్లిన మరో కోడి.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? ఈ సూపర్ టిప్స్ మీకోసం..!

3 March 2026

Thalapathy Vijay: దళపతి విజయ్‌తో విడాకులు.. భరణంగా సంగీతకు ఎన్ని కోట్లు రానున్నాయంటే?

3 March 2026

Bank Holiday: హోలీ సెలవు మారిందా..? బుధవారం బ్యాంకులు మూసి ఉంటాయా?

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.