Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

MI vs PBKS IPL 2026: డి కాక్, నమన్ మెరుపులు.. పంజాబ్‌కు 196 పరుగుల టార్గెట్ ఇచ్చిన ముంబై ఇండియన్స్

16 April 2026

Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే తీర్థం కేవలం నీరు కాదు.. అది రోగాలను నయం చేసే దివ్యౌషధం! ఇలా తీసుకుంటేనే పూర్తి పుణ్యఫలం.

16 April 2026

భార్య కాపురానికి రాలేదని ఫ్రస్టేషన్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎంత పని చేశాడో..

16 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Jagan On Mopidevi,ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు.. కానీ ఎందుకిలా? నేతలతో వైఎస్ జగన్ – ysrcp chief ys jagan mohan reddy reaction on mopidevi venkataramana joining tdp in repalle review
ఆంధ్రప్రదేశ్

Ys Jagan On Mopidevi,ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు.. కానీ ఎందుకిలా? నేతలతో వైఎస్ జగన్ – ysrcp chief ys jagan mohan reddy reaction on mopidevi venkataramana joining tdp in repalle review

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Jagan On Mopidevi,ఆయన విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదు.. కానీ ఎందుకిలా? నేతలతో వైఎస్ జగన్ – ysrcp chief ys jagan mohan reddy reaction on mopidevi venkataramana joining tdp in repalle review
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీలో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు టీడీపీలో చేరారు. ఇటీవలే రాజ్యసభ ఎంపీ పదవులకు, వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు నేతలు.. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో చేరడంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మోపిదేవి విషయంలో ఏరోజూ తప్పుచేయలేదన్న జగన్.. ఆయన పార్టీ మారడం చాలా బాధాకరమని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మండలిని రద్దుచేయాలనే ఆలోచన వచ్చినప్పుడు.. మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు కూడా పంపించామని జగన్ అభిప్రాయపడ్డారు.

రేపల్లె నియోజకవర్గ వైసీపీ నేతలపై వైఎస్ జగన్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే మోపిదేవి వెంకటరమణ పార్టీ మార్పు వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదని వైసీపీ నేతల వద్ద చెప్పుకొచ్చారు. మా నాన్న వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా తనకు కష్టాలు వచ్చాయని.. 16 నెలలు జైళ్లోపెట్టారని గుర్తు చేశారు. అయినా కూడా ప్రజలను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారన్న సంగతిని గుర్తుంచుకోవాలని వైఎస్ జగన్.. వైసీపీ నేతలకు సూచించారు. మోపిదేవి వెంకటరమణ విషయంలోనూ తానెప్పడూ తప్పుచేయలేదన్న జగన్.. ఆయన పార్టీని వీడటం బాధాకరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేపల్లె నియోజకవర్గంలో గణేష్‌కు నేతలు మద్దతుగా నిలవాలని సూచించారు. దేవుడు ఎప్పుడూ మంచివైపు ఉంటాడని.. కష్టాలు శాశ్వతం కాదని నేతల వద్ద జగన్ అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఆగస్టు నెలలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ ఎంపీ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. ఆ తర్పాతి కాలంలో ఆర్. కృష్ణయ్య సైతం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి 8కి చేరింది. అయితే రాజీనామా చేసిన తర్వాత మోపిదేవి, బీద మస్తాన్‌రావు.. టీడీపీలో చేరిపోయారు. ఆర్. కృష్ణయ్య బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునే అవకాశం ఉంది. అలాగే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులకు సైతం కీలక పదవులు దక్కుతాయనే ప్రచారం నడుస్తోంది. మరి వీరి రాజకీయ భవిష్యత్తు ఏంటనేదీ చూడాలి మరి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

భార్య కాపురానికి రాలేదని ఫ్రస్టేషన్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎంత పని చేశాడో..

16 April 2026

Instagram Friendship Minor Girls Out From Home,ఇన్‌స్టాలో పరిచయం.. ఇళ్లు వదిలేసి వెళ్లిన ఇద్దరు మైనర్ బాలికలు.. 48 గంటల్లో పట్టుకున్న పోలీసులు – instagram friendship two minor girls out from home without intimation to parents in chittoor police caught in 48 hours

16 April 2026

LIC HFL Jobs 2026: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎంపికైతే నెలకు రూ.41,509 జీతం

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

MI vs PBKS IPL 2026: డి కాక్, నమన్ మెరుపులు.. పంజాబ్‌కు 196 పరుగుల టార్గెట్ ఇచ్చిన ముంబై ఇండియన్స్

16 April 2026

MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్…

Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే తీర్థం కేవలం నీరు కాదు.. అది రోగాలను నయం చేసే దివ్యౌషధం! ఇలా తీసుకుంటేనే పూర్తి పుణ్యఫలం.

16 April 2026

భార్య కాపురానికి రాలేదని ఫ్రస్టేషన్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎంత పని చేశాడో..

16 April 2026

BP: బీపీ 200 దాటితే ప్రాణం మీదికి వచ్చినట్లేనా? ఈ ప్రమాద సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

16 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

MI vs PBKS IPL 2026: డి కాక్, నమన్ మెరుపులు.. పంజాబ్‌కు 196 పరుగుల టార్గెట్ ఇచ్చిన ముంబై ఇండియన్స్

16 April 2026

Teertham Rules: తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? అయితే అపచారమే తీర్థం కేవలం నీరు కాదు.. అది రోగాలను నయం చేసే దివ్యౌషధం! ఇలా తీసుకుంటేనే పూర్తి పుణ్యఫలం.

16 April 2026

భార్య కాపురానికి రాలేదని ఫ్రస్టేషన్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎంత పని చేశాడో..

16 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025454

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.