Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. ముసుగులు ధరించి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా..?

7 March 2026

Samsung Galaxy S25 FEపై భారీ తగ్గింపు.. కొత్త ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఇవే!

7 March 2026

మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..!

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు
తాజా వార్తలు

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు

.By .7 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి ఛాన్స్.. 12 రాశుల వారికి వారఫలాలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


1 Mesham weekly horoscope

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): రవి, బుధ, కుజుల అనుకూలత వల్ల వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు గడిస్తారు. ఆర్థిక, వృత్తి, ఉద్యోగ విషయాల్లో మీరు ఆశించిన విధంగా సాగిపోతుంది. కొద్ది శ్రమతో పనులు, ప్రయత్నాల్లో కార్యసిద్ధికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. పట్టుదలగా పనులన్నీ పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి విందులో పాల్గొంటారు. వినోద యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తిపరంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధపెట్టండి. వాహనాలను వేగంగా నడపకపోవడం మంచిది. విద్యార్థులు తేలికగా పురోగమిస్తారు. ప్రేమ వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి.

2 Vrishabham weekly horoscope

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల రాజయోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా పురోగమిస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు ఆర్థి కంగా సహాయం చేయడంతో పాటు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా పురోగమిస్తాయి.

3 Mithunam weekly horoscope

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. వారమంతా సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా చక్కబెట్టుకుంటారు. పెండింగ్ పనులన్నీ మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. పదోన్నతికి, జీతాల పెరుగుదలకు అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

4 Karkatakam weekly horoscope

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): రాశ్యధిపతి చంద్రుడి అనుకూల సంచారం, లాభాధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. స్నేహితుల సహాయంతో వ్యక్తి గత పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉన్నా, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక విషయాల్లో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సరదాగా సాగుతాయి.

5 Simham weekly horoscope

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి సంచారంతో పాటు గురు బలం కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఆశించిన శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విదేశీ ఉద్యోగాల కోసం చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల సమాచారం అందుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆర్థికంగా అదృష్టం పట్టే సూచనలున్నాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. స్నేహితులతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో విద్యార్థులు దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా సాగిపోతాయి. ఆదాయ పరిస్థితి మరింత మెరుగవుతుంది.

6 Kanya weekly horoscope

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): గురు బలం, శుక్ర బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు, హోదా పెరిగే అవకాశం ఉంది. కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. అనుకోకుండా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల ద్వారా శుభవార్త వింటారు. ఇష్టమైన ఆలయాల సందర్శనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు చదువుల్లోనూ, పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి.

7 Tula weekly horoscope

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడి ఉచ్ఛ స్థితితో పాటు భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల వారమంతా చాలా వరకు విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, సానుకూల ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నిటినీ పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో కొన్ని మార్పులు ప్రవేశపెడతారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

8 Vrishchikam weekly horoscope

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కుజ, రవి, శుక్ర బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి కొద్దిగా ప్రోత్సాహకాలు ఉండవచ్చు. పనిభారం బాగా తగ్గే అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు బాగా సాయం చేయడం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.

9 Dhanussu weekly horoscope

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ1): రాశ్యధిపతి గురువుతో పాటు శుక్రుడు కూడా అనుకూల సంచారం చేస్తున్నందువల్ల వారమంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఇతరులకు సాయం చేయగల స్థితిలో ఉంటారు. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

10 Makaram weekly horoscope

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శనితో తృతీయ స్థానంలో ఉచ్ఛ స్థితి శుక్రుడు యుతి చెందడం వల్ల ఈ రాశివారికి వారమంతా వైభవంగా గడిచిపోతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధువులకు సహాయం చేయడం జరుగుతుంది. మిత్రుల తోడ్పాటుతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి సహాయంతో ఆస్తి వివాదం ఒకటి సమసిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.

11 Kumbham weekly horoscope

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ధన స్థానంలో శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మరిం తగా మెరుగుపడి ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇతరులతో ఆచితూచి వ్యవ హరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు, తిప్పట ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు సమయం బాగానే ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

12 Meenam weekly horoscope

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, చతుర్థంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల వారమంతా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం పెట్టుకోవద్దు. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Samsung Galaxy S25 FEపై భారీ తగ్గింపు.. కొత్త ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఇవే!

7 March 2026

మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..!

7 March 2026

T20 World Cup Final : రేపే భారత్-కివీస్ తుది పోరు.. ఫ్రీగా లైవ్ చూడటం ఎలాగో తెలుసా?

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. ముసుగులు ధరించి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా..?

7 March 2026

సభ్యసమాజం సిగ్గుపడే ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఖాండ్వా జిల్లాలో ఈ హృదయ విదారకమైన, సిగ్గుచేటు సంఘటన జరిగింది.…

Samsung Galaxy S25 FEపై భారీ తగ్గింపు.. కొత్త ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఇవే!

7 March 2026

మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..!

7 March 2026

T20 World Cup Final : రేపే భారత్-కివీస్ తుది పోరు.. ఫ్రీగా లైవ్ చూడటం ఎలాగో తెలుసా?

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఛీ.. ఛీ.. ఏం మనుషులురా.. ముసుగులు ధరించి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై ఇంత దారుణమా..?

7 March 2026

Samsung Galaxy S25 FEపై భారీ తగ్గింపు.. కొత్త ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ ఇవే!

7 March 2026

మీ రాశికి ఈ రంగులు సరిపోవు.. వేసుకున్నారంటే అదృష్టం తిరగబడుద్ది..!

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.