Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ICC T20I Rankings 2026 : చితకొట్టిన సంజూ శాంసన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రాకెట్లా దూసుకెళ్లాడుగా

11 March 2026

Google Internship 2026: రూ. 10 లక్షల స్టైఫండ్‌తో గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్.. ఈ అర్హతలుంటే చాలు.. నక్కతోక తొక్కినట్టే!

11 March 2026

మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Inspirational Story: ‘ఒకేసారి IT జాబ్‌, గర్ల్‌ ఫ్రెండ్.. హుఫ్‌! అమెరికా వీధుల్లో ఛాయ్‌ బిజినెస్‌’.. ఈ కుర్రాడి కథ మీకు చెప్పాలి
జాతీయం

Inspirational Story: ‘ఒకేసారి IT జాబ్‌, గర్ల్‌ ఫ్రెండ్.. హుఫ్‌! అమెరికా వీధుల్లో ఛాయ్‌ బిజినెస్‌’.. ఈ కుర్రాడి కథ మీకు చెప్పాలి

.By .11 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Inspirational Story: ‘ఒకేసారి IT జాబ్‌, గర్ల్‌ ఫ్రెండ్.. హుఫ్‌! అమెరికా వీధుల్లో ఛాయ్‌ బిజినెస్‌’.. ఈ కుర్రాడి కథ మీకు చెప్పాలి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Inspirational Story: ‘ఒకేసారి IT జాబ్‌, గర్ల్‌ ఫ్రెండ్.. హుఫ్‌! అమెరికా వీధుల్లో ఛాయ్‌ బిజినెస్‌’.. ఈ కుర్రాడి కథ మీకు చెప్పాలి

బీహార్‌కి చెందిన ఓ యువకుడి జీవిత గాథ సరిగ్గా ఇందుకు సరిపోతుంది. పేదరికంలో పుట్టి పెరిగి ఎన్నో ఎదురు దెబ్బలు తిని చివరకు అమెరికాలో IT జాబ్‌ కొట్టాడు. కష్టాలన్నీ తీరిపోయాయిలే అని అనుకునేలోపు లేఆఫ్‌ రూపంలో మళ్లీ రోడ్డునపడ్డాడు. అయితే ఓడిపోయిన వాడిగా ఇంటికి వెళ్లాలని అతడు అనుకోలేదు. కిందపడినా మళ్లీ ప్రారంభించాలనే తపనతో అమెరికా వీధుల్లో చాయ్ వెంచర్‌గా మారాడు. ఏళ్ల తరబడి తగిలిన ఎదురుదెబ్బలు, పడినా లేవాలనే గుణపాఠాలు ఆ యువకుడి జీవితాన్ని సమూలంగా మార్చేశాయి. హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఇన్‌స్టా యూజర్‌ నెట్టింట అతడి కథ పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

పేదరికంతో నిండిన బాల్యం

ప్రభాకర్ ప్రసాద్.. బీహార్‌లోని గంగా నదికి సమీపంలో ఉన్న బార్హ్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. నిరుపేద కుటుంబం. శీతాకాలంలో కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు లేకపోవడంతో బియ్యం, పప్పు బస్తాల మధ్యలో పడుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్య మాత్రమే తమ కుటుంబ పరిస్థితులను మారుస్తుందని ప్రసాద్‌ తల్లిదండ్రులు నమ్మేవారు. దీంతో
బాల్యంలో తమ ఊరిలోనే స్థానిక పాఠశాలలో హిందీ-మీడియంలో చదువుకున్నాడు. ప్రసాద్‌ చదువులో బాగా రాణించాడు. చదువుతోపాటు క్రీడలు, ఇతర కార్యకలాపాలలోనూ చురుకుగా ఉండేవాడు.

లైఫ్‌ టర్నింగ్‌ పాయింట్‌ అదే..

ప్రసాద్‌ జీవితంలో చోటు చేసుకున్న ఓ భయానక సంఘటన రాత్రికి రాత్రే అతడి కుటుంబ జీవితాన్ని మార్చివేసింది. ఓ వ్యక్తి ప్రసాద్‌ సోదరుడిని వేరొకరిగా భావించి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో భయాందోళనలకు గురైన ప్రసాద్ కుటుంబం బీహార్ వదిలి భోపాల్‌కు మకాం మార్చింది. కొత్త వాతావరణానికి అలవాటు పడటం అంత సులభం కాదు. ముఖ్యంగా పాఠశాలలో. ఈ మార్పు ప్రసాద్‌కు కష్టంగా తోచింది. బీహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ CBSE స్కూల్‌కి మారడంతో బేసిక్‌ పదాలు కూడా ప్రసాద్‌కు అర్థం కాలేదు. తోటి విద్యార్ధులు అతడి భాషను చూసి నవ్వేవారు. అయినప్పటికీ ప్రసాద్‌ కష్టపడి చదివి చివరికి తన క్లాస్‌మేట్స్‌ స్థాయికి చేరగలిగాడు. IIT స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత 2008లో తొలిసారి ఉద్యోగంలో చేరాడు.

 

View this post on Instagram

 

A post shared by Humans of Bombay (@officialhumansofbombay)

కార్పొరేట్ ఉద్యోగమే కానీ అతరి అభిరుచి వేరు..

ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా కోడింగ్ అతనికి నచ్చేది కాదు. నచ్చని ఉద్యోగం చేయలేక బాడీబిల్డింగ్ అతని ప్రధాన ఆసక్తిగా మారింది. వెంటనే జిమ్‌లో చేరాడు. జాబ్‌ కంటే ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడిపేవాడు. దీంతో అతడి శరీరం బాలీవుడ్‌ హీరో మాదిరి తయారైంది. అంతే మోడలింగ్ కోసం ముంబైకి మకాం మార్చాడు. కానీ అక్కడి వాస్తవికత ప్రసాద్‌ కళ్లు తెరిపించింది. అంధేరీలో చిన్న ఫ్లాట్లు, పొడవైన ఆడిషన్ క్యూలతో విసిగి వచ్చిన ఏ పని అయినా చేసేందుకు సిద్ధపడ్డాడు.

అమెరికాకు పయనం.. కొత్త సవాళ్లు!

కొన్నేళ్ల తర్వాత ప్రసాద్ తన గర్ల్‌ ఫ్రెండ్ సాయంతో అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే ప్రయాణం సజావుగా సాగలేదు. అతని వీసా రెండుసార్లు తిరస్కరించారు. చివరికి మూడో ప్రయత్నంలో వీసా వచ్చింది. 2014లో MBA కోసం టెక్సాస్‌లో అడుగుపెట్టాడు. MBA పూర్తి చేసి కార్పొరేట్ జాబ్‌లో చేరాడు. అయితే వరుసగా అన్ని ఉద్యోగాల నుంచి తొలగించారు. వరుస లేఆఫ్‌లతో ప్రసాదం ఆరోగ్యం కూడా క్షీణించడం ప్రారంభించింది. ఆరోగ్యమైతే కుదుటపడిందికానీ జీవితం ఎటువైపు వెళుతుందో తెలియని తికమకలో ఎన్నో రోజులు గడిపాడు. ఒక రాత్రి అతను కూర్చుని తనను తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు. లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలంటే ఏం చేయాలి?.. ఈ ప్రశ్నకు అతడికి చాలా త్వరగా సమాధానం దొరికింది. అదే – చాయ్. ప్రసాద్ స్నేహితుడు చాయ్ సలహా ఇవ్వడంతో బాధ మిగిలించని ఉద్యోగం ఏదైనా చేయాలని నిర్ణయించాడు. స్వంతంగా టీ తయారు చేయడం ప్రారంభించాడు. ‘టీ ఎప్పుడూ నాకు ఇంటిని గుర్తు చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో వేల మైళ్ల దూరంలో నివసిస్తున్నప్పటికీ టీ నన్ను ఇంటి జ్ఞాపకాలతో అనుసంధానిస్తుంది’.. ఈ ఆలోచనే అతడి పెట్టుబడిగా మారింది.

లాస్‌ఏంజెల్స్‌ వీధుల్లో టీ బిజినెస్

చాయ్ అమ్మకం అనే ఆలోచన నెమ్మదిగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన తన ప్రయాణం క్రమంగా తన చుట్టూ ఉన్న జనాలు చేరడం ప్రారంభించారు. నిజమైన ఇండియన్‌ స్టైల్ చాయ్‌ అక్కడి అందరికీ నచ్చేసింది. క్రమంగా ప్రసాద్‌ దినచర్య కూడా మారిపోయింది. రోజూ ఉదయాన్నే నిద్రలేచి పేపర్‌ వర్క్‌ పూర్తి చేసి, కొత్త దేశంలో చిన్న ఆహార వ్యాపారాన్ని నిర్వహించడం ఎలాగో తెలుసుకున్నాడు. అలా మళ్లీ మొదటి నుంచి నేర్చుకోవడం ప్రారంభించాడు. తక్కువ పెట్టుబడితో ఎలాంటి వ్యాపార ప్రణాళిక లేకుండా అతడు కాలిఫోర్నియాలో చాయ్ అమ్మడం మొదలుపెట్టాడు. రోజూ తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి పని చేయడం ప్రారంభించాడు. కప్‌ చాయ్‌ 8 డాలర్లకు అమ్మడం ద్వారా రోజు ముగిసే నాటికి ఆశించిన లాభాలు రాసాగాయి. ‘నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రయాణం ఊహించదగినది కాదు. బియ్యం బస్తాల కింద పడుకోవడం నుంచి యుఎస్‌లో చాయ్ అమ్మడం వరకు నేను CEO కాలేదు, నేను చాయ్ గైని అయ్యాను. చివరికి నేను జీవితంలో స్థిరపడ్డాను’ అని తన కథ నెటిజన్లతో పంచుకున్నాడు మన ప్రసాద్. ఓడిపోవడంతో జీవితం ముగియదు. అవకాశాలను అందిపుచ్చుకుని కొత్తబాటలు స్వయంగా వేసుకోవాలని ఈ యువకుడి జీవిత కథ చెబుతుంది. మీరేమంటారు.. నిజమేనా?

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ

11 March 2026

బీకేర్‌ఫుల్..! ఫుడ్ డెలివరీ ముసుగులో కొత్తరకం మోసం.. ఆదమరిస్తే అంతే సంగతులు..!

11 March 2026

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 12 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తి కారుణ్య మరణానికి ఆమోదం..!

11 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ICC T20I Rankings 2026 : చితకొట్టిన సంజూ శాంసన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రాకెట్లా దూసుకెళ్లాడుగా

11 March 2026

ICC T20I Rankings 2026 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్…

Google Internship 2026: రూ. 10 లక్షల స్టైఫండ్‌తో గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్.. ఈ అర్హతలుంటే చాలు.. నక్కతోక తొక్కినట్టే!

11 March 2026

మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు

11 March 2026

Indian Railways: రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. గ్యాస్ కొరత వేళ రైల్వేశాఖ సంచలన నిర్ణయం..?

11 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ICC T20I Rankings 2026 : చితకొట్టిన సంజూ శాంసన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రాకెట్లా దూసుకెళ్లాడుగా

11 March 2026

Google Internship 2026: రూ. 10 లక్షల స్టైఫండ్‌తో గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్.. ఈ అర్హతలుంటే చాలు.. నక్కతోక తొక్కినట్టే!

11 March 2026

మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు

11 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.