Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఓరీ దేవుడు.. ఈ వీడియో చూశారంటే.. ఈ జన్మలో బయట పాప్‌కార్న్‌ తినరు..! షాకింగ్‌ వీడియో వైరల్‌

12 March 2026

Vijay Thalapathy : తండ్రికి మరోసారి షాకిచ్చిన జాసన్ సంజయ్.. విజయ్‏కు ఇంట్లోనే దెబ్బ మీద దెబ్బ..

12 March 2026

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»తొలుత అహకారోడంటూ దూరం.. కట్‌చేస్తే.. బబుల్ ప్రపోజల్‌తో ఫిదా.. వీళ్ల సీక్రెట్ మ్యారేజ్ వెనుక ఇంత స్టోరీ ఉందా..!
తాజా వార్తలు

తొలుత అహకారోడంటూ దూరం.. కట్‌చేస్తే.. బబుల్ ప్రపోజల్‌తో ఫిదా.. వీళ్ల సీక్రెట్ మ్యారేజ్ వెనుక ఇంత స్టోరీ ఉందా..!

.By .12 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
తొలుత అహకారోడంటూ దూరం.. కట్‌చేస్తే.. బబుల్ ప్రపోజల్‌తో ఫిదా.. వీళ్ల సీక్రెట్ మ్యారేజ్ వెనుక ఇంత స్టోరీ ఉందా..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తొలుత అహకారోడంటూ దూరం.. కట్‌చేస్తే.. బబుల్ ప్రపోజల్‌తో ఫిదా.. వీళ్ల సీక్రెట్ మ్యారేజ్ వెనుక ఇంత స్టోరీ ఉందా..!

Jasprit Bumrah Sanjana Ganesan Love Story: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మైదానంలో బ్యాటర్లను తన యార్కర్లతో వణికించడంలో దిట్ట. అయితే, తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన చాలా సిగ్గరి. ఇటీవల హర్భజన్ సింగ్, గీతా బస్ర హోస్ట్ చేసిన “హూ ఈజ్ ది బాస్?” (Who’s The Boss?) షోలో బుమ్రా తన భార్య సంజనా గణేశన్‌తో కలిసి సందడి చేశారు. వీరిద్దరి ప్రేమకథ, వివాహం, ఇంట్లో ఎవరు ‘బాస్’ అనే విషయాలపై ఆసక్తికర ముచ్చట్లు పంచుకున్నారు.

‘గర్విష్ఠి’ అనుకున్నా.. కానీ!

తొలిసారిగా వీరిద్దరూ 2019 ప్రపంచకప్ సమయంలో కలిశారు. ఆ సమయంలో బుమ్రాను చూసి సంజనా చాలా గర్విష్ఠి అనుకుందట. దీనిపై బుమ్రా స్పందిస్తూ.. “నేను కొత్త వారితో త్వరగా కలవలేను, అందుకే ఆమెకు హాయ్ చెప్పలేదు. దాంతో నాకు పెళ్లయిపోయిందని, భార్య ఎక్కడో కూర్చొని గమనిస్తోందని అందుకే నాతో మాట్లాడట్లేదని సంజనా భావించింది” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు.

కానీ, ట్రెంట్ బ్రిడ్జ్‌లో వర్షం పడినప్పుడు జరిగిన ఒక సంభాషణ వీరి మధ్య స్నేహానికి పునాది వేసింది. బుమ్రానే స్వయంగా చొరవ తీసుకుని సంజనాతో మాట్లాడటం ప్రారంభించాడు.

సీక్రెట్ పెళ్లి వెనుక అసలు రహస్యం..

బుమ్రా వివాహం జరిగే వరకు ఎవరికీ తెలియకుండా ఉండటంపై హర్భజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. “పెళ్లికి రెండు రోజుల ముందు వరకు కూడా నాకు తెలియదు” అని భజ్జీ అనగా, దానికి బుమ్రా బదులిస్తూ.. “మేము దాచాలని అనుకోలేదు, కేవలం సోషల్ మీడియాలో పెట్టలేదు. బయట కలిసినా ఆమె స్పోర్ట్స్ యాంకర్ కాబట్టి అందరూ ఇంటర్వ్యూ కోసమే కలిశాము అనుకునేవారు” అని సరదాగా చెప్పారు.

బబుల్ టూ బబుల్ ప్రపోజల్!

కరోనా సమయంలో వీరి ప్రపోజల్ చాలా విభిన్నంగా జరిగింది. ఐపీఎల్ సమయంలో అబుదాబిలో ఇద్దరూ వేర్వేరు బబుల్స్‌లో ఉన్నప్పుడు, బుమ్రా ఒక రింగ్ తీసుకువెళ్లి హోటల్ గది బాల్కనీలో క్యాండిల్ లైట్ సెటప్ చేసి సంజనాకు ప్రపోజ్ చేశాడట.

ఇంట్లో అసలు బాస్ ఎవరు?

ఇంట్లో ఎవరు బాస్ అనే ప్రశ్నకు ఇద్దరూ ఏకగ్రీవంగా తమ కుమారుడు ‘అంగద్’ పేరే చెప్పారు. “ప్రస్తుతానికి మా ఇంట్లో అంగద్ చెప్పిందే వేదం. వాడు పడుకోమంటే పడుకుంటాం, లేవమంటే లేస్తాం” అని బుమ్రా సరదాగా వ్యాఖ్యానించారు. ఆర్థిక విషయాలు లేదా ముఖ్యమైన నిర్ణయాల దగ్గర ఒకరికొకరు తోడుగా ఉంటూ పనులు పంచుకుంటామని వారు తెలిపారు.

బుమ్రాలో మార్పు తెచ్చిన సంజనా..

పెళ్లి తర్వాత బుమ్రా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అంతకుముందు కేవలం హోటల్ గది, గ్రౌండ్‌కే పరిమితమైన బుమ్రా.. ఇప్పుడు సంజనా పుణ్యమా అని ప్రపంచాన్ని చుట్టేస్తున్నారట. సంజనాకు ఉన్న రీసెర్చ్ నాలెడ్జ్ వల్ల కొత్త ప్రదేశాలు చూడటం, విభిన్న ఆహారాలను రుచి చూడటం అలవాటు చేసుకున్నట్లు బుమ్రా తెలిపారు.

“జీవితాన్ని సీరియస్‌గా తీసుకోకుండా సంతోషంగా గడపడమే మా లక్ష్యం” అని ఈ జంట తమ అభిమానులకు సందేశమిచ్చారు. మైదానంలో దూకుడుగా ఉండే బుమ్రా, బయట ఎంత సరదాగా ఉంటారో ఈ ఇంటర్వ్యూ ద్వారా మరోసారి స్పష్టమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఓరీ దేవుడు.. ఈ వీడియో చూశారంటే.. ఈ జన్మలో బయట పాప్‌కార్న్‌ తినరు..! షాకింగ్‌ వీడియో వైరల్‌

12 March 2026

Vijay Thalapathy : తండ్రికి మరోసారి షాకిచ్చిన జాసన్ సంజయ్.. విజయ్‏కు ఇంట్లోనే దెబ్బ మీద దెబ్బ..

12 March 2026

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్ర మరో సంచలన నిర్ణయం

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఓరీ దేవుడు.. ఈ వీడియో చూశారంటే.. ఈ జన్మలో బయట పాప్‌కార్న్‌ తినరు..! షాకింగ్‌ వీడియో వైరల్‌

12 March 2026

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో బయట ఫుడ్‌ తినే వారి ఆరోగ్యంపట్ల ఆందోళన కలిగిస్తోంది. పరిశుభ్రతను పట్టించుకోని…

Vijay Thalapathy : తండ్రికి మరోసారి షాకిచ్చిన జాసన్ సంజయ్.. విజయ్‏కు ఇంట్లోనే దెబ్బ మీద దెబ్బ..

12 March 2026

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

12 March 2026

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్ర మరో సంచలన నిర్ణయం

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఓరీ దేవుడు.. ఈ వీడియో చూశారంటే.. ఈ జన్మలో బయట పాప్‌కార్న్‌ తినరు..! షాకింగ్‌ వీడియో వైరల్‌

12 March 2026

Vijay Thalapathy : తండ్రికి మరోసారి షాకిచ్చిన జాసన్ సంజయ్.. విజయ్‏కు ఇంట్లోనే దెబ్బ మీద దెబ్బ..

12 March 2026

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.