Gold Price Today: మహిళలకు ఊహించని శుభవార్త అందుతోంది. బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తు్న్న పసిడి ధరలు.. ఒక్కసారిగా దిగి వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం సామాన్య ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి.
తాజాగా తులం బంగారంపై భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకంగా ఒక్క రోజులోనే రూ.2,240 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములపై 1640 వరకు దిగి వచ్చింది. అలాగే వెండిపై ఏకంగా రూ.5000 వరకు పతనమైంది.
ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,420 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,300 వద్ద ఉంది. ఇక వెండి ధర తగ్గిన తర్వాత రూ.2,70,000 వద్ద స్థిరపడింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,570 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,450 వద్ద ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,420 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,300 వద్ద ఉంది.
అయితే బంగారం, వెండి ధరలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం, అమెరికా సెంట్రల్ బ్యాంక్ (Fed) వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై ఎఫెక్ట్ చూపాయి. గత వారం రోజులుగా నిలకడగా పెరిగిన ధరల నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మి లాభాలను గడించడం వల్ల మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి.






