Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra: బీడు భూమిలో ఏదో వింత చప్పుళ్లు.. ఏంటా అని రైతు వెళ్లి చూడగా

1 July 2025

Hyderabad: అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన కూకట్‌పల్లి టాక్స్ సీనియర్ ఆఫీసర్.. వీడియో

1 July 2025

పాలకూరను పారేయాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ ట్రిక్‌ తో తాజాగా ఉంచండి..!

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Loco Pilot Murder Case Update,విజయవాడ లోకో పైలెట్ హత్య కేసులో సంచలన విషయాలు.. అదే రోజు మరో ముగ్గురు కూడా.. సీసీ ఫుటేజ్‌లో! – vijayawada loco pilot murder case suspect caught on cctv camera
ఆంధ్రప్రదేశ్

Vijayawada Loco Pilot Murder Case Update,విజయవాడ లోకో పైలెట్ హత్య కేసులో సంచలన విషయాలు.. అదే రోజు మరో ముగ్గురు కూడా.. సీసీ ఫుటేజ్‌లో! – vijayawada loco pilot murder case suspect caught on cctv camera

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Loco Pilot Murder Case Update,విజయవాడ లోకో పైలెట్ హత్య కేసులో సంచలన విషయాలు.. అదే రోజు మరో ముగ్గురు కూడా.. సీసీ ఫుటేజ్‌లో! – vijayawada loco pilot murder case suspect caught on cctv camera
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



విజయవాడ రైల్వే స్టేషన్‌లో లోకో పైలెట్ దారుణ హత్య కలకలం రేపింది. నగరానికి చెందిన ఏబేలు రైల్వే షంటింగ్‌ లోకో పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ఎఫ్‌ క్యాబిన్‌ మధ్య బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఏబేలు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా లోకో పైలెట్‌పై ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడే రైలు పట్టాలపై పడిపోయారు. కొద్దిసేపటికి అక్కడే ఉన్న మరో షంటింగ్‌ లోకో పైలెట్‌ పృథ్వీరాజ్‌ చూసి బాధితుడిని రైల్వే సిబ్బంది సహాయంతో సమీపంలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు.. అక్కడ వైద్యం అందించారు. ఏబేలు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించి గాలింపు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలను బట్టి నిందితుడికి మానసికస్థితి సరిగా లేదని గుర్తించారు. ఈ ఘటన తర్వాత రైల్వే ఉద్యోగులు, కార్మికులు ఆందోళనలో ఉన్నారు. లోకో పైలెట్‌ ఏబేలు హత్య కేసు నిందితుడు రైల్వే పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గుడివాడ సెక్షన్‌లోని ఎల్‌సీ గేటు నంబరు 41 దగ్గర పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లోకో పైలెట్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేసిన తర్వాత అదే రోజు మరో ముగ్గురిపై దాడి చేసి తప్పించుకు తిరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. మిగిలిన రైల్వే స్టేషన్‌లను, పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. గుడివాడ రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసులో నిందితుడు గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. నిందితుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. అతడికి నిజంగా మతిస్థిమితం లేదా.. నటిస్తున్నాడా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాదు నిందితుడిపై గతంలో ఏమైనా పాత కేసులు ఉన్నాయా అని వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల పొరుగు రాష్ట్రంలోని ఓ రైల్వేస్టేషన్‌లోనూ ఇదే తరహాలో ఇద్దరిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి మకాం మార్చి విజయవాడ వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడ్ని పోలీసులు మీడియా ముందుకు తీసుకురావాల్సి ఉంది.. అధికారికంగా కూడా ప్రకటన చేయలేదు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

4th Class Student Guntur Collector Office,Guntur 4th Class Student: అమ్మ కోసం బుడ్డోడి ప్రయత్నం.. కలెక్టర్‌నే కదిలించింది.. – class 4 student request for mother tiffin stall permission at guntur collector office resolved

1 July 2025

AP RGUKT Counseling 2025: ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

1 July 2025

AP EAPCET Counseling 2025: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆగస్టు 4 నుంచి తరగతులు షురూ!

1 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Andhra: బీడు భూమిలో ఏదో వింత చప్పుళ్లు.. ఏంటా అని రైతు వెళ్లి చూడగా

1 July 2025

రెండు పాములు పెనవేసుకుని.. సుమారు అర్ధగంటసేపు సందడి చేశాయి. ఆ దృశ్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ ఫోన్లకు పని…

Hyderabad: అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన కూకట్‌పల్లి టాక్స్ సీనియర్ ఆఫీసర్.. వీడియో

1 July 2025

పాలకూరను పారేయాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ ట్రిక్‌ తో తాజాగా ఉంచండి..!

1 July 2025

కీపర్‌గా మొదలై, డేంజరస్ బ్యాటర్‌గా మారి.. అంతే స్పీడ్‌గా ముగిసిన కెరీర్… ‘గబ్బర్’ ఆత్మకథలో సంచలన నిజాలు

1 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Andhra: బీడు భూమిలో ఏదో వింత చప్పుళ్లు.. ఏంటా అని రైతు వెళ్లి చూడగా

1 July 2025

Hyderabad: అమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన కూకట్‌పల్లి టాక్స్ సీనియర్ ఆఫీసర్.. వీడియో

1 July 2025

పాలకూరను పారేయాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ ట్రిక్‌ తో తాజాగా ఉంచండి..!

1 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.