Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మీ ఇంటిని శుభ్రం చేసే సీక్రెట్ మీకోసం.. కార్నర్స్ లో దుమ్ము శుభ్రం చేయడం ఇక ఈజీ అవుతుంది..!

1 July 2025

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు.. కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం

1 July 2025

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ttd Complaint On Tweet Over Chandrababu,చంద్రబాబుకు ప్రాణగండం.. ఆ వీడియోపై టీటీడీ సీరియస్, తిరుమలలో కేసు – ttd files complaint against a person for sharing false video on cm chandrababu naidu
ఆంధ్రప్రదేశ్

Ttd Complaint On Tweet Over Chandrababu,చంద్రబాబుకు ప్రాణగండం.. ఆ వీడియోపై టీటీడీ సీరియస్, తిరుమలలో కేసు – ttd files complaint against a person for sharing false video on cm chandrababu naidu

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ttd Complaint On Tweet Over Chandrababu,చంద్రబాబుకు ప్రాణగండం.. ఆ వీడియోపై టీటీడీ సీరియస్, తిరుమలలో కేసు – ttd files complaint against a person for sharing false video on cm chandrababu naidu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో ట్వీట్ కలకలంరేపింది. ఏపీ సీఎంకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ఈ నెల 4న తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రబాబు సీఎం హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పించడం దేవుడికి కూడా ఇష్టం లేదు అంటూ ట్వీట్ చేశారు. ఆయనకు కచ్చితంగా ప్రాణహాని ఉందని చైతన్య పేరతో ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించే వీడియో ట్వీట్ చేయడం కలకలంరేపింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న వీడియోను ట్వీట్ చేయడంతో టీటీడీ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. తిరుమల వన్ టౌన్ లో ఈ ట్వీట్‌పై ఫిర్యాదు చేశారు.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.Blind Mannn అనే పేరుతో ఉన్న ఎక్స్‌ అకౌంట్‌లో ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు తలపై పెట్టుకొని ఉన్న వీడియో‌ని ట్వీట్ చేసి.. దేవుడికి ఇష్టంలేదని స్పష్టంగా కనిపిస్తుంది.. మళ్లీ చెప్తున్నా ప్రాణగండం ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఎక్స్‌లో ట్వీట్ చేసిన Blind Mannn అకౌంట్ నిర్వహకుడు చైతన్యపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చైతన్యతో పాటుగా మరికొందరిపై వన్ టౌన్ పోలీసులు 196, 298, 299, 353(2) r/w BNS సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నెల 4న తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి ముందగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం దగ్గరకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం దగ్గరకు వెళ్లగా.. టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంక‌య్య చౌద‌రి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ ఈవో శ్యామలరావు సీఎం చంద్రబాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమల శ్రీవారికి చక్రస్నానం

మరోవైపు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌నివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకుముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికి, భక్తులు సుఖశాంతులతో ఉండడానికి- చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్ని సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం.

చక్రస్నానం (అవభృథం)లో శ్రీవారి సుదర్శనచక్రానికి (చక్రత్తాళ్వార్‌కు) పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు శ్రీభూ సమేత మలయప్పస్వామికి ‘స్నపన తిరుమంజనం’ నిర్వహించారు. తర్వాత సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణి జలంలో ముంచి, స్నానం చేయించారు. ఆ దివ్యాయుధ స్పర్శవల్ల పవిత్రమైన పుష్కరిణి జలంలో భక్తసమూహం కూడా అదే సమయంలో స్నానం చేశారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికి దర్శించిన వారికి ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

AP EAPCET Counseling 2025: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. ఆగస్టు 4 నుంచి తరగతులు షురూ!

1 July 2025

Vangalapudi Anitha Girls Hostel,హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక.. విద్యార్థుల పరిస్థితి ఏంటిక? – ap home minister vangalapudi anitha surprise visit on payakaraopeta bc girls hostel

1 July 2025

Andhra News: మంచి రోజులొచ్చాయి గురూ.. రికార్డ్‌ ధర పలికిన కోణసీమ కొబ్బరి!

1 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మీ ఇంటిని శుభ్రం చేసే సీక్రెట్ మీకోసం.. కార్నర్స్ లో దుమ్ము శుభ్రం చేయడం ఇక ఈజీ అవుతుంది..!

1 July 2025

ఇంటి లోపల కొన్ని ప్రదేశాలు ఎప్పుడూ శుభ్రం చేయడం మర్చిపోతాం. తలుపుల అంచులు, విండో సిల్స్, గోడల క్రింద భాగాల్లోకి…

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు.. కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం

1 July 2025

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!

1 July 2025

Vaibhav Suryavanshi: కాస్ట్లీ బంతితో ప్రాక్టీస్.. వైభవ్ భారీ సిక్స్‌ల సీక్రెట్ ఇదే.. ధరెంతో తెలుసా?

1 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మీ ఇంటిని శుభ్రం చేసే సీక్రెట్ మీకోసం.. కార్నర్స్ లో దుమ్ము శుభ్రం చేయడం ఇక ఈజీ అవుతుంది..!

1 July 2025

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు.. కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం

1 July 2025

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!

1 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.