Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»మీకు బొటన వేలు, మణికట్టు మధ్య నొప్పి ఉందా..? అయితే..
ఆంధ్రప్రదేశ్

మీకు బొటన వేలు, మణికట్టు మధ్య నొప్పి ఉందా..? అయితే..

.By .21 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మీకు బొటన వేలు, మణికట్టు మధ్య నొప్పి ఉందా..? అయితే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మీకు బొటన వేలు, మణికట్టు మధ్య నొప్పి ఉందా..? అయితే..

కొత్తగా తల్లిదండ్రులైన వారికి లేదా రిపీటెడ్‌గా శ్రమతో కూడిన పనులు చేసేవారికి మణికట్టు, బొటనవేలు ప్రాంతంలో తీవ్రమైన నొప్పి రావడం సర్వసాధారణం. ఈ పరిస్థితిని డిక్వెర్వైన్స్ స్టినోసైనోవైటిస్ అని వైద్య పరిభాషలో పిలుస్తారు. దీనిని సాధారణంగా “మమ్మీ తంబ్” అని కూడా వ్యవహరిస్తారు. డాక్టర్లు ఈ వ్యాధి కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్సా పద్ధతులను వివరంగా వివరిస్తున్నారు.

డిక్వెర్వైన్స్ స్టినోసైనోవైటిస్ అంటే ఏమిటి?

బొటనవేలును కదిలించడానికి ఉపయోగపడే రెండు ప్రధాన కండరాలు – అబ్డక్టర్ పొలిసిస్ లాంగస్ (Abductor Pollicis Longus), ఎక్స్టెన్సర్ పొలిసిస్ బ్రెవిస్ (Extensor Pollicis Brevis) – మణికట్టు చుట్టూ ఉండే ఎక్స్టెన్సర్ రెటినాక్యులం (Extensor Retinaculum) అనే టైట్ బ్యాండ్ కిందగా వెళ్తాయి. రిపీటెడ్‌గా కదలికలు లేదా అధిక శ్రమ వల్ల ఈ టెండన్‌ల చుట్టూ ఉండే సైనోవియల్ షీత్ (ఆ కవరింగ్) వాపుకు గురవుతుంది. దీని ఫలితంగా నొప్పి, మంట ఏర్పడతాయి. ఉదాహరణకు, పిల్లలను తరచుగా ఎత్తడం, దించడం లేదా హెవీ లేబర్ వర్క్ వంటివి ఈ పరిస్థితికి దారితీయవచ్చు.

డిక్వెర్వైన్స్ స్టినోసైనోవైటిస్ ఉన్న రోగులు ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తారు:

మణికట్టు, బొటనవేలు ప్రాంతంలో తీవ్రమైన నొప్పి.

బొటనవేలు కదిపినప్పుడు నొప్పి తీవ్రతరం కావడం.

కొందరిలో నొప్పి ఉన్న ప్రాంతంలో వాపు (స్వెల్లింగ్) కనిపించడం.

మంట పుడుతున్నట్లు లేదా లాగుతున్నట్లు నొప్పి ఉండటం, ఇది కొన్నిసార్లు మోచేయి వరకు విస్తరించవచ్చు.

వ్యాధి నిర్ధారణ, ఫ్రింకెల్ స్టీన్ టెస్ట్:

డిక్వెర్వైన్స్ స్టినోసైనోవైటిస్‌ను నిర్ధారించడానికి ఎలాంటి సంక్లిష్టమైన పరీక్షలు అవసరం లేదు. ఫ్రింకెల్ స్టీన్ టెస్ట్ (Finkelstein Test) అనే సాధారణ శారీరక పరీక్ష ద్వారా దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఈ పరీక్షను మీరే ఇంట్లో కూడా చేసుకోవచ్చు.

1. మీ బొటనవేలును అరచేతి లోపలికి మడవండి.

2. మిగిలిన నాలుగు వేళ్లతో బొటనవేలును గట్టిగా పట్టుకుని పిడికిలి బిగించండి.

3. ఇప్పుడు మీ మణికట్టును లోపలి వైపునకు (చిటికెన వేలు వైపునకు) వంచండి. ఈ స్థితిలో మీకు మణికట్టు బయటి వైపు ఉన్న కండరాలలో తీవ్రమైన నొప్పి వస్తే, ఫ్రింకెల్ స్టీన్ టెస్ట్ పాజిటివ్ అయినట్లు. ఇది డిక్వెర్వైన్స్ స్టినోసైనోవైటిస్ ఉండటానికి సంకేతం.

చికిత్సా పద్ధతులు:

డిక్వెర్వైన్స్ స్టినోసైనోవైటిస్ పెద్దగా ప్రమాదకరమైన వ్యాధి కాదు. సాధారణంగా సులభంగా నయం చేయవచ్చు.

చికిత్స పద్ధతులు: 1. విశ్రాంతి: బొటనవేలుతో కూడిన ఏ కార్యకలాపానైనా నిలిపివేయడం అత్యంత ముఖ్యం.

2. స్ప్లింట్‌ల వాడకం: బొటనవేలు కదలకుండా విశ్రాంతినివ్వడానికి తంబ్ స్పైకా స్ప్లింట్ (Thumb Spica Splint) ను 24/7 ధరించడం తప్పనిసరి.

3. నొప్పి నివారణ మందులు (అనాల్జెసిక్స్): ఇబుప్రోఫెన్ (Ibuprofen), డైక్లోఫెనాక్ (Diclofenac), ఎసిక్లోఫెనాక్ (Aceclofenac) వంటి నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) నొప్పిని తగ్గించడంతో పాటు వాపును కూడా తగ్గిస్తాయి.

4. ఫిజియోథెరపీ:ఐఎఫ్టీ (IFT) లేదా టెన్స్ (TENS) వంటి ఫిజియోథెరపీ పద్ధతులు ప్రభావిత ప్రాంతంలో రక్త సరఫరాను పెంచి, వాపును తగ్గిస్తాయి.

5. స్టెరాయిడ్ ఇంజెక్షన్: పైన పేర్కొన్న పద్ధతులతో నొప్పి తగ్గకపోతే, డాక్టర్ సలహా మేరకు ప్రభావిత ప్రాంతంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వవచ్చు. 95% కేసులలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది డే కేర్ ప్రొసీజర్.

6. శస్త్రచికిత్స: చాలా అరుదైన, రెసిస్టెంట్ కేసులలో, స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా పనిచేయని పక్షంలో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఈ శస్త్రచికిత్స కూడా ఒక డే కేర్ ప్రొసీజర్ మరియు పెద్దగా సంక్లిష్టమైనది కాదు. ఇందులో అబ్డక్టర్ పొలిసిస్ లాంగస్, ఎక్స్టెన్సర్ పొలిసిస్ బ్రెవిస్ టెండన్‌ల చుట్టూ ఉన్న ఎక్స్టెన్సర్ రెటినాక్యులంను రిలీజ్ చేస్తారు. దీనివల్ల తక్షణ నొప్పి నివారణ లభించి, 10-15 రోజుల్లో సాధారణ కార్యకలాపాలకు తిరిగి రావచ్చు. కాబట్టి, మణికట్టు, బొటనవేలు నొప్పితో బాధపడుతున్నట్లయితే, అది డిక్వెర్వైన్స్ స్టినోసైనోవైటిస్ కావచ్చు. ఇది నయం చేయగల వ్యాధి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సరైన నిర్ధారణ, చికిత్స కోసం వైద్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం.

Also Read: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో కొత్త హైవే.. ఇక HYD వెళ్లడం మరింత ఈజీ.. 

 

 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Youth Away From Marriage,పిల్లల సంగతి అటుంచి.. పెళ్లే వద్దంటున్న ఏపీ యువత.! – many andhra pradesh youth shying away from marriage and parenthood

21 March 2026

Monkey Attack Old Woman Died Kakinada,కాకినాడ: మనిషిని చంపేసిన కోతులు.. 20 వానరాలు ఒక్కసారిగా దాడి చేసి.. – old woman died in a monkey attack at peddipalem in prathipadu mandal of kakinada district

21 March 2026

మీ అరచేతిలో ‘X’ గుర్తు ఉందా.. అయితే జరగబోయేది ఇదే…

21 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

బుల్లితెరపై సీరియల్ తారలకు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రతి రోజూ టీవీల్లో వచ్చే సీరియల్ నటీనటులకు స్టార్…

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026

Kitchen Hacks: వేసవిలో కూరగాయలు, పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంచే సూపర్ టిప్స్.. ఏం చేయాలంటే?

21 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

21 March 2026

Eggshell Uses: గుడ్డు పెంకులను పారేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలిస్తే షాకవుతారు!

21 March 2026

హేయ్..! మత్తువదలరా 2 బ్యూటీ.. నువ్వేనా..? బయట భలే ఉంది భయ్యా..!!

21 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025186

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025186

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.