Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Success Astrology: రాసిపెట్టుకోండి.. ఆకస్మాత్తుగా వారి జీవితం మారిపోవడం పక్కా..!

23 March 2026

Banana Peel Recipes: అన్నంలోకి అదిరిపోయే ‘అరటి తొక్క పచ్చడి’.. కరకరలాడే చిప్స్.. ఇంకా ఎన్ని వెరైటీలు చేయొచ్చంటే..

23 March 2026

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Gas Cylinder: గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..
తాజా వార్తలు

Gas Cylinder: గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..

.By .23 March 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gas Cylinder: గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Gas Cylinder: గ్యాస్ కొరత క్రమంలో బిగ్ డెసిషన్.. ఇకపై 10 కిలోల గ్యాస్ సిలిండర్.. ! తక్కువ ధరకే..

దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నా డెలివరీ కాకపోవడం, డెలివరీలో జాప్యం జరగుతుండటంతో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాణిజ్య సిలిండర్ల లభ్యత లేకపోవడంతో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఆహార పదార్ధాల దుకాణాలు మూతపడగా.. కొన్ని స్టాల్స్ ధరలను పెంచి విక్రయిస్తున్నాయి. దీంతో సామాన్యులపై భారం పడుతుంది. పరిస్థితి చక్కబడటానికి మరికొద్ది నెలల సమయం పట్టే అవకాశముంది. యుద్దం ముగిసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటేనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నాయి.

ఇక నుంచి 10 కేజీల సిలిండర్..!

గ్యాస్ కొరత క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు కొరతను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా 10 కిలోల డొమెస్టిక్ సిలిండర్ తీసుకొచ్చేందుకు యోచిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగించే గృహ సిలిండర్ 14.2 కిలోలు ఉండగా.. దీనిని 10 కిలోలకు తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చేసేందుకు ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. పాత సిలిండర్లలోనే 10 కేజీల ఎల్పీజీ నింపి అందించనున్నారని తెలుస్తోంది. దీని ద్వారా గ్యాస్ కొరత తగ్గడంతో పాటు అందరికీ గ్యాస్ అందుతుందని కంపెనీలు భావిస్తోన్నాయి. త్వరలోనే దీనిని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే మనం 10 కేజీల ఎల్పీజీని చూడవచ్చు.

ధర తగ్గింపు..?

ఒకవేళ సిలిండర్‌లో నింపే గ్యాస్‌ను తగ్గిస్తే ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకోసం రెగ్యూలేటరీ అనుమతులు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నాయి. 14.2 కిలోల సిలిండర్ సగటున ఒక కుటుంబానికి 35 నుంచి 40 రోజుల పాటు వస్తోంది.అదే 10 కిలలో సిలిండర్ అయితే ఒక నెల పాటు వస్తుంది. గ్యాస్ అందరికీ అందించేందుకు చమురు కంపెనీలు ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నాయి. ఇక సిలిండర్ బరువును తగ్గిస్తే.. లేబుల్ మార్చాల్సి ఉంటుంది. ఇక రీఫిల్లింగ్ వ్యవస్థలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రతిపాదనల దశలో ఉండగా.. చమురు కంపెనీలు ఈ నిర్ణయం ఎలా అమలు చేస్తాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. హార్ముజ్ జలసంధి ద్వారా గ్యాస్ సరఫరా ఎక్కువగా జరుగుతుంది. కానీ యుద్దం క్రమంలో రవాణాలో అంతరాయం కలుగుతోంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Success Astrology: రాసిపెట్టుకోండి.. ఆకస్మాత్తుగా వారి జీవితం మారిపోవడం పక్కా..!

23 March 2026

Banana Peel Recipes: అన్నంలోకి అదిరిపోయే ‘అరటి తొక్క పచ్చడి’.. కరకరలాడే చిప్స్.. ఇంకా ఎన్ని వెరైటీలు చేయొచ్చంటే..

23 March 2026

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Success Astrology: రాసిపెట్టుకోండి.. ఆకస్మాత్తుగా వారి జీవితం మారిపోవడం పక్కా..!

23 March 2026

మేషం: ఈ రాశివారు ప్రస్తుతం ఎంత అధ్వాన దశలో ఉన్నా ఉగాది తర్వాత నుంచి క్రమంగా కోలుకుని కొత్త జీవితం…

Banana Peel Recipes: అన్నంలోకి అదిరిపోయే ‘అరటి తొక్క పచ్చడి’.. కరకరలాడే చిప్స్.. ఇంకా ఎన్ని వెరైటీలు చేయొచ్చంటే..

23 March 2026

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

23 March 2026

కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లు కట్టుకొని.. మరీ వెళ్లి చూసిన సినిమాలు ఇవే

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Success Astrology: రాసిపెట్టుకోండి.. ఆకస్మాత్తుగా వారి జీవితం మారిపోవడం పక్కా..!

23 March 2026

Banana Peel Recipes: అన్నంలోకి అదిరిపోయే ‘అరటి తొక్క పచ్చడి’.. కరకరలాడే చిప్స్.. ఇంకా ఎన్ని వెరైటీలు చేయొచ్చంటే..

23 March 2026

Allu Arjun: ఏ స్టార్ హీరోకి సాధ్యం కానిది.. అల్లు అర్జున్ మాత్రమే ఎలా సాధ్యం

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025222

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025217

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.