Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..?? సంక్షోభంలోనూ తగ్గేదేలే.. | imf Projects 6.5% Growth for Indian Economy in 2026-27 Despite Global Tensions – Strong Outlook

14 April 2026

మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి తెగ పిచ్చెక్కిస్తుందిగా.. మార్కెట్లో భారీ క్రేజ్

14 April 2026

Summer Health Alert: వేసవిలో కోసిన పండ్లు తింటున్నారా? మీ శరీరానికి అందేది పోషకాలు కాదు.. విషం!

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tamil Nadu polls: చివరి ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! | vijay Rides Bicycle and Whistles While Campaigning in Tamil Nadu – Voters Thrilled Vijay campaign
తాజా వార్తలు

Tamil Nadu polls: చివరి ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! | vijay Rides Bicycle and Whistles While Campaigning in Tamil Nadu – Voters Thrilled Vijay campaign

.By .12 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tamil Nadu polls: చివరి ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! | vijay Rides Bicycle and Whistles While Campaigning in Tamil Nadu – Voters Thrilled Vijay campaign
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

India

oi-Bomma Shivakumar

Time
Published: Sunday, April 12, 2026, 21:28 [IST]

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. డీఎంకే, టీవీకే, ఏఐఏడీఎంకే పార్టీలు నువ్వా..? నేనా..? అన్నట్లుగా ప్రచార పర్వాన్ని వేగవంతం చేశాయి. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి దృష్టి దళపతి విజయ్ పైనే ఉంది. సినిమాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న విజయ్.. ఆ తర్వాత టీవీకే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆయన బరిలోకి దిగుతున్నారు. దాంతో అరవ రాజకీయాలు ఇప్పుడు విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి.

విజయ్ ఎన్నికల ప్రచారం కూడా అదే రేంజ్ లో సాగుతోంది. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం.. బహిరంగ సభలకు లక్షల్లో తరలివస్తున్నారు. కారుపై ర్యాలీ చేస్తే రోడ్డుకు ఇరువైపులా వేలాదిమంది గుమికూడి స్వాగతం పలుకుతున్నారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ ఒక్క ట్వీట్ పెడితే నిమిషాల్లో లక్షల వ్యూస్ లైక్స్ వస్తున్నాయి. దాంతో ప్రత్యర్థులకు విజయ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే తనకున్న కోట్లాది మంది ఫ్యాన్స్ ను విజయ్ ఓటు బ్యాంక్ గా మార్చుకుంటారా..? లేదా..? అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే విజయ్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నా.. ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు చాలా చోట్ల రద్దు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే విజయ్ పాల్గొనాల్సిన అనేక రాజకీయ ప్రచార కార్యక్రమాలు అనూహ్యంగా రద్దు అవుతున్నాయి. దీనికి గల కారణాలు తెలియడం లేదు. ఓవైపు భద్రతా కారణాల దృష్ట్యా.. ఎన్నికలకు ముందు మరో కరూర్ లాంటి ఘటన జరగకుండా విజయ్ జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడున్న తక్కువ సమయంలో కరూర్ లాంటి తొక్కిసలాట జరిగితే విజయ్ పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. అందువల్లనే విజయ్ కావాలనే ర్యాలీలు, బహిరంగ సభలను రద్దు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

సైకిల్ ఎక్కిన వాడు ఓడినట్టు చరిత్రలో లేదు.

Then : #NTR

Now : #Vijay #TVKVijay‌ #ThalapattyVijay pic.twitter.com/B3jw3ZEpMT

— Milagro Movies (@MilagroMovies) April 12, 2026

మరోవైపు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో విజయ్ తన చివరి బ్రహ్మాస్త్రం అయిన సైకిల్ ను ప్రయోగించారు. విజయ్ సైకిల్ మీద ఎన్నికల ప్రచారం నిర్వహించి అందరినీ ఫిదా చేశారు. గతంలోనూ చాలాసార్లు విజయ్ సైకిల్ పై వెళ్లి ఓటు వేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన సైకిల్ వెంట వేలాదిగా ఫ్యాన్స్ తరలివచ్చారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని విజయ్ ప్రయోగించినట్లు స్పష్టం అవుతోంది. విజయ్ సైకిల్ మీద విజిల్ వేసుకుంటూ ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. దాంతో విజయ్ కూడా మనలాంటి ఓ సామాన్యుడే అన్న సంకేతం రాష్ట్ర ప్రజలకు వెళ్లాలని విజయ్ భావిస్తున్నారు.

Vijay Rides Bicycle and Whistles While Campaigning in Tamil Nadu Voters Thrilled Vijay campaign

ఇక విజయ్ సైకిల్ తొక్కిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. సైకిల్ తొక్కినోళ్లు ఓడినట్లు చరిత్రలో లేదు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే విజయ్ సైకిల్ టూ సీఎం సీటు గ్యారంటీ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ ఈ సారి రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. ఇక తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు గాను ఒకే దశలో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..?? సంక్షోభంలోనూ తగ్గేదేలే.. | imf Projects 6.5% Growth for Indian Economy in 2026-27 Despite Global Tensions – Strong Outlook

14 April 2026

మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి తెగ పిచ్చెక్కిస్తుందిగా.. మార్కెట్లో భారీ క్రేజ్

14 April 2026

Summer Health Alert: వేసవిలో కోసిన పండ్లు తింటున్నారా? మీ శరీరానికి అందేది పోషకాలు కాదు.. విషం!

14 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..?? సంక్షోభంలోనూ తగ్గేదేలే.. | imf Projects 6.5% Growth for Indian Economy in 2026-27 Despite Global Tensions – Strong Outlook

14 April 2026

India oi-Bomma Shivakumar Published: Tuesday, April 14, 2026, 20:09 [IST] పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు.…

మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి తెగ పిచ్చెక్కిస్తుందిగా.. మార్కెట్లో భారీ క్రేజ్

14 April 2026

Summer Health Alert: వేసవిలో కోసిన పండ్లు తింటున్నారా? మీ శరీరానికి అందేది పోషకాలు కాదు.. విషం!

14 April 2026

AP Inter Results 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఇంటర్‌ ఫలితాలు విడుదల! ఎన్ని గంటల కంటే..

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..?? సంక్షోభంలోనూ తగ్గేదేలే.. | imf Projects 6.5% Growth for Indian Economy in 2026-27 Despite Global Tensions – Strong Outlook

14 April 2026

మాంసాల్లో అందమైనది ఇదే.. యువతకి తెగ పిచ్చెక్కిస్తుందిగా.. మార్కెట్లో భారీ క్రేజ్

14 April 2026

Summer Health Alert: వేసవిలో కోసిన పండ్లు తింటున్నారా? మీ శరీరానికి అందేది పోషకాలు కాదు.. విషం!

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.