Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!

14 April 2026

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి ఓడిన కోల్‌కతా

14 April 2026

మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? | china Unveils New Four-Point Peace Plan to Mediate Growing Tensions Between United States and Iran

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»పాక్ పరువు గంగలో.. అప్పుల అప్పారావుకు అంతర్జాతీయ అవమానం! | Pakistan Shamed, Govt Fails to Pay Luxury Hotel Bill for US-Iran Peace Talks in Islamabad, Details
తాజా వార్తలు

పాక్ పరువు గంగలో.. అప్పుల అప్పారావుకు అంతర్జాతీయ అవమానం! | Pakistan Shamed, Govt Fails to Pay Luxury Hotel Bill for US-Iran Peace Talks in Islamabad, Details

.By .14 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పాక్ పరువు గంగలో.. అప్పుల అప్పారావుకు అంతర్జాతీయ అవమానం! | Pakistan Shamed, Govt Fails to Pay Luxury Hotel Bill for US-Iran Peace Talks in Islamabad, Details
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

International

oi-Jakki Mahesh

Time
Published: Tuesday, April 14, 2026, 17:30 [IST]

పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి తలదించుకునేలా చేసింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరోసారి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంది. ఇస్లామాబాద్‌లోని ఓ విలాసవంతమైన హోటల్ బిల్లు కూడా చెల్లించలేని స్థితికి ఆ దేశ ప్రభుత్వం చేరుకుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్‌లోని ప్రతిష్టాత్మక ‘సెరెనా హోటల్’ను వేదికగా ఎంచుకున్నారు. అయితే ఈ చర్చల తర్వాత హోటల్ బిల్లు చెల్లించాల్సిన బాధ్యతను పాక్ ప్రభుత్వం విస్మరించింది. కనీసం ఆ అతిథుల బిల్లులు కూడా కట్టలేని ఆర్థిక కౌశల్యం పాకిస్థాన్‌కు లేదని స్పష్టమైంది. చివరికి హోటల్ యజమాని ‘ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్’ స్వయంగా ముందుకు వచ్చి ఆ ఖర్చులన్నింటినీ భరించాల్సి రావడం గమనార్హం.

21 గంటల చర్చలు.. సున్నా ఫలితం
అమెరికా, ఇరాన్ వంటి అగ్రదేశాల మధ్య చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తాను అంతర్జాతీయంగా ఓ బలమైన మధ్యవర్తినని ప్రపంచానికి చాటి చెప్పాలని పాకిస్థాన్ భావించింది. దీనిని తమ దౌత్య విజయంగా ప్రచారం చేసుకుంది. కానీ ఒక సాధారణ హోటల్ బిల్లు కూడా కట్టలేకపోవడం ఆ దేశ ఆర్థిక కష్టాలను, పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టింది. ఇది పాకిస్థాన్ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ పరంగా పెద్ద విపత్తుగా మారింది.

Pakistan Shamed Govt Fails to Pay Luxury Hotel Bill for US-Iran Peace Talks in Islamabad Details

ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య దాదాపు 21 గంటల పాటు మారథాన్ చర్చలు జరిగాయి. ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల తొలగింపు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి. అయితే ఇంత సమయం వెచ్చించినా ఏ ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా ఈ శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అటు శాంతి చర్చలు విఫలం కావడం, ఇటు హోటల్ బిల్లు వివాదం పాకిస్థాన్‌కు రెండు వైపులా ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

కటిక పేదరికంలో పాకిస్థాన్
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆంక్షల మధ్య నలుగుతున్న ఆ దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. యూఏఈ వంటి దేశాలు కూడా తామిచ్చిన అప్పులు తీర్చాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేశీయంగా తిండికే కటకటలాడుతుంటే, విదేశీ దౌత్యానికి ఆతిథ్యం ఇవ్వడం పాకిస్థాన్‌కు మోయలేని భారంగా మారిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

English summary

Cash-strapped Pakistan fails to pay the Serena Hotel bill for US-Iran peace talks. The hotel owner had to cover costs as the 21-hour marathon meeting ended without a deal.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!

14 April 2026

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి ఓడిన కోల్‌కతా

14 April 2026

మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? | china Unveils New Four-Point Peace Plan to Mediate Growing Tensions Between United States and Iran

14 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!

14 April 2026

maharashtra A shocking incident in Amravati, Maharashtra: Police have arrested a sexual predator who sexually…

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి ఓడిన కోల్‌కతా

14 April 2026

మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? | china Unveils New Four-Point Peace Plan to Mediate Growing Tensions Between United States and Iran

14 April 2026

రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌.. | telangana Faces Intense Heatwave Orange Alert Issued Across Multiple Districts Soaring Temperatures

14 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!

14 April 2026

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి ఓడిన కోల్‌కతా

14 April 2026

మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? | china Unveils New Four-Point Peace Plan to Mediate Growing Tensions Between United States and Iran

14 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025449

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.