Indian Railways Interesting Facts: మీరు ఎప్పుడైనా కిక్కిరిసిన రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడినప్పుడు రైలు బోగీలపై (Coaches) వివిధ రంగుల్లో పెయింట్ చేసిన చారలను గమనించారా? పసుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు.. ఇలా రకరకాల రంగులు కనిపిస్తుంటాయి. వీటిని కేవలం అలంకరణ కోసం వేసిన డిజైన్ అనుకుంటే పొరపాటే. భారతీయ రైల్వేలో ఇవి ఒక నిశ్శబ్ద సమాచార వ్యవస్థగా పనిచేస్తాయి. లక్షలాది మంది ప్రయాణికులకు, రైల్వే సిబ్బందికి మార్గనిర్దేశం చేసే ఈ రంగుల వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

