Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Eluru News,ఏలూరు: భర్తను బెదిరిద్దామని కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులమందు దాచిన భార్య.. అనుకోకుండా తాగి చిన్నారి మృతి – five year old child died after drinking pesticide mistaking it for a cool drink in eluru district

11 March 2026

వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

11 March 2026

Financial Planning: EMIలో ఐఫోన్ కొంటున్నారా?.. మీరు చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

11 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Jagan Nandamuri Balakrishna,బాలకృష్ణకు వైఎస్ జగన్ అభినందనలు.. అప్పటి ఫోటో వైరల్! – ysrcp chief ys jagan congratulates nandamuri balakrishna and other padma award winners
ఆంధ్రప్రదేశ్

Ys Jagan Nandamuri Balakrishna,బాలకృష్ణకు వైఎస్ జగన్ అభినందనలు.. అప్పటి ఫోటో వైరల్! – ysrcp chief ys jagan congratulates nandamuri balakrishna and other padma award winners

.By .26 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Jagan Nandamuri Balakrishna,బాలకృష్ణకు వైఎస్ జగన్ అభినందనలు.. అప్పటి ఫోటో వైరల్! – ysrcp chief ys jagan congratulates nandamuri balakrishna and other padma award winners
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పద్మ అవార్డు విజేతలపై అభినందనల వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడుగురికి పద్మ అవార్డులు వరించాయి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. వీరితో పాటుగా మరో ఐదుగురికి పద్మ శ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే విజేతలకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. అయితే బాలయ్యకు జగన్ అభినందనలు తెలియజేయటంతో టీడీపీ శ్రేణులు ఓ పాత ఫోటోను వైరల్ చేస్తున్నాయి.

Samayam Teluguబాలకృష్ణకు వైఎస్ జగన్ అభినందనలు.. అప్పటి ఫోటో వైరల్!
బాలకృష్ణకు వైఎస్ జగన్ అభినందనలు.. అప్పటి ఫోటో వైరల్!

గణతంత్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు వరించాయి. వైద్యులు నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డు వరించగా.. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. అలాగే వివిధ రంగాలలో సేవలు చేసిన మరో ఐదుగురికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. ఈ నేపథ్యంలో పద్మ అవార్డుల విజేతలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పద్మ అవార్డుల విజేతలకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

“విఖ్యాత వైద్యులు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి గారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమే కాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్సనందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధునిక వైద్య పద్ధతులు, చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.” అంటూ డాక్టర్ నాగేశ్వరరెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు.

అలాగే సినీనటుడు నందమూరి బాలకృష్ణకు కూడా వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. బాలకృష్ణతో పాటు మిగతా పద్మ అవార్డు విజేతలను అభినందిస్తూ జగన్ మరో ట్వీట్ చేశారు. “ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు. డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నంద‌మూరి బాల‌కృష్ణ (క‌ళ‌లు), మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మాడుగుల నాగ‌ఫ‌ణి శ‌ర్మ (క‌ళ‌లు), కేఎల్ కృష్ణ (విద్యా, సాహిత్యం), మిరియాల అప్పారావు (క‌ళ‌లు), వాదిరాజు రాఘ‌వేంద్రాచారి పంచ‌ముఖి (విద్య, సాహిత్యం)లకు అభినందనలు” అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

అయితే నందమూరి బాలకృష్ణకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేసిన నేపథ్యంలో.. టీడీపీ శ్రేణులు వైఎస్ జగన్‌కు చెందిన ఓ పాత ఫోటోను వైరల్ చేస్తున్నాయి. 2000 సంవత్సరంలో న్యూ ఇయర్ విషెస్ చెప్తూ వైఎస్ జగన్, బాలకృష్ణ ఫోటోతో ఉన్న యాడ్ ఇచ్చినట్లుగా ఓ పేపర్ యాడ్ వైరల్ చేస్తున్నాయి. మా బాలయ్య బాబు సమరసింహారెడ్డి.. 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ అంటూ జగన్ ఫోటో అందులో ఉంది. ఈ పేపర్ యాడ్‌ను టీడీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Eluru News,ఏలూరు: భర్తను బెదిరిద్దామని కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులమందు దాచిన భార్య.. అనుకోకుండా తాగి చిన్నారి మృతి – five year old child died after drinking pesticide mistaking it for a cool drink in eluru district

11 March 2026

AP Government Inquiry On Velagapudi Fire Accident,అమరావతిలో అగ్నిప్రమాదం వెనుక కుట్ర? హోం మంత్రి ఆదేశాలు – ap government orders inquiry into velagapudi fire incident in amaravati

11 March 2026

Anantha Babu Wife Lakshmi Durga High Court,డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు హైకోర్టు కీలక ఆదేశాలు – high court orders to anantha babu wife lakshmi durga in driver subramanyam murder case

11 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Eluru News,ఏలూరు: భర్తను బెదిరిద్దామని కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులమందు దాచిన భార్య.. అనుకోకుండా తాగి చిన్నారి మృతి – five year old child died after drinking pesticide mistaking it for a cool drink in eluru district

11 March 2026

ఏలూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బుట్టాయిగూడెం మండలంలో అంతర్వేదిగూడెంలో కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగి ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు…

వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

11 March 2026

Financial Planning: EMIలో ఐఫోన్ కొంటున్నారా?.. మీరు చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

11 March 2026

Tollywood: దాసరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్

11 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Eluru News,ఏలూరు: భర్తను బెదిరిద్దామని కూల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులమందు దాచిన భార్య.. అనుకోకుండా తాగి చిన్నారి మృతి – five year old child died after drinking pesticide mistaking it for a cool drink in eluru district

11 March 2026

వేసవి తాపం నుంచి కాపాడే 10 అద్భుతమైన ఇండియన్ డ్రింక్స్..! వీటితో హెల్త్‌, బాడీ కూలింగ్‌

11 March 2026

Financial Planning: EMIలో ఐఫోన్ కొంటున్నారా?.. మీరు చెల్లిస్తున్న మొత్తం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే..

11 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.