Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టైం అయిపోతోందని ఫాస్ట్‌గా తినేస్తున్నారా? ఈ 5 అనర్ధాల గురించి తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

14 March 2026

మహేష్ బాబు ఫ్యాన్ ఫైర్.. చిక్కుల్లో పడ్డ డైరెక్టర్ హరీష్ శంకర్

14 March 2026

సమ్మర్‌‌లో చన్నీటి స్నానం చేస్తే జరిగేది ఇదే.. న్యూరాలజిస్టులు చెప్తున్న షాకింగ్ విషయాలు

14 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Seaplane In Ap,ఏపీలో మరోచోట సీప్లేన్ సర్వీసులు.. ఆ రూట్లోనే.. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సర్వే.. – ap government plans to start seaplane tourism from rushikonda to jolaput soon
ఆంధ్రప్రదేశ్

Seaplane In Ap,ఏపీలో మరోచోట సీప్లేన్ సర్వీసులు.. ఆ రూట్లోనే.. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సర్వే.. – ap government plans to start seaplane tourism from rushikonda to jolaput soon

.By .27 January 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Seaplane In Ap,ఏపీలో మరోచోట సీప్లేన్ సర్వీసులు.. ఆ రూట్లోనే.. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సర్వే.. – ap government plans to start seaplane tourism from rushikonda to jolaput soon
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే సీప్లేన్ సర్వీసుల ద్వారా సందర్శకులను ఆకర్షించాలని పర్యాటకశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ శ్రీశైలం సీప్లేన్ సర్వీసును కూడా లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పుడు మరోచోట సీప్లేన్ సర్వీస్ ఏర్పాటు చేసేందుకు చర్యలు మొదలెట్టారు. అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏపీ పర్యాటక శాఖ, స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్, ఏపీ జెన్‌కో అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు. రుషికొండ- జోలాపుట్ సీప్లేన్ సర్వీసుపై అధ్యయనం జరిపారు.

Samayam Teluguఏపీలో మరోచోట సీప్లేన్ సర్వీసులు.. ఆ రూట్లోనే.. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సర్వే..
ఏపీలో మరోచోట సీప్లేన్ సర్వీసులు.. ఆ రూట్లోనే.. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సర్వే..

ఏపీలో మరో చోట సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు చక చకా అడుగులు పడుతున్నాయి. విజయవాడ – శ్రీశైలం సీప్లేన్ సర్వీసులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సర్వీసును గండికోట వరకూ పొడిగించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు మరోచోట సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో త్వరలోనే సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు, ఏపీ జెన్‌కో అధికారులు జోలాపుట్ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే సర్వే కూడా నిర్వహించారు.

రుషికొండ- జోలాపుట్‌ మార్గంలో అరకును కలుపుతూ త్వరలో సీప్లేన్ టూరిజం సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌లైన్స్ అధికారులు ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఉండే జోలాపుట్ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో డ్రోన్‌తో సర్వే నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ కూడా ఇటీవల సుజనకోట, డుడుమ వాటర్‌ఫాల్స్, జోలాపుట్ రిజర్వాయర్లను పరిశీలించారు. ఈ ప్రాంతాలన్నీ పర్యాటకానికి అనువుగా ఉన్నాయనే కారణంతో సీప్లేన్ టూరిజం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రుషికొండ బీచ్ స్ట్రెచ్‌ను ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పరిశీలించారు. జోలాపుట్ నుంచి అరకుకు రెండు గంటల ప్రయాణ సమయం పడుతుందని అధికారుల అంచనా.

సీప్లేన్ సర్వీసుల ద్వారా పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే విజయవాడ శ్రీశైలం సీప్లేన్ సర్వీస్ ప్రారంభించారు. ఇప్పుడు రుషికొండ జోలాపుట్ సీప్లేన్ సర్వీస్ ప్రారంభించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ సీప్లేన్ సర్వీసుల ద్వారా దేశంలోని పర్యాటకులతో పాటు విదేశీయులను కూడా ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, ప్రకృతి అందాలు ఏపీ సొంతం. అయితే ఈ పర్యాటక ప్రాంతాలతో అనుసంధానం తక్కువగా ఉండటం.. వీటిలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో సీప్లేన్ ద్వారా పర్యాటకులను అక్కడకు చేర్చవచ్చనేది అధికారుల ఆలోచన.

అందులో భాగంగానే రుషికొండ – జోలాపుట్ సీప్లేన్ సర్వీసు గురించి అధ్యయనం జరుగుతోంది. ఈ అధ్యయనం పూర్తి అయిన తర్వాత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తారు. సఖినేటిపల్లి, పసర్లపూడి, దిండి, అంతర్వేది, సీలేరు వంటి చోట్ల కూడా ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు, రాష్ట్ర పర్యాటకశాఖ అధికారులు అధ్యయనం జరుపుతున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Prohibited Property List,ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. నిషేధిత జాబితా నుంచి 66,157 ఎకరాల తొలగింపు – ap cabinet removes 66157 acres from 22 a prohibited list

14 March 2026

Ap Local Body Elections,ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. చంద్రబాబు కీలక ప్రకటన – ap local body elections in six months cm chandrababu key announcement

14 March 2026

ఫర్టిలైజర్స్ ఏం వాడకుండా సంవత్సరమంతా తోటకూరను ఇలా పెంచొచ్చు..

14 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టైం అయిపోతోందని ఫాస్ట్‌గా తినేస్తున్నారా? ఈ 5 అనర్ధాల గురించి తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

14 March 2026

పది నిమిషాల్లో ముగించాల్సిన భోజనాన్ని రెండు నిమిషాల్లోనే లాగించేస్తున్నాం. ఇలా వేగంగా తినడం వల్ల మనకు తెలియకుండానే అనేక తీవ్రమైన…

మహేష్ బాబు ఫ్యాన్ ఫైర్.. చిక్కుల్లో పడ్డ డైరెక్టర్ హరీష్ శంకర్

14 March 2026

సమ్మర్‌‌లో చన్నీటి స్నానం చేస్తే జరిగేది ఇదే.. న్యూరాలజిస్టులు చెప్తున్న షాకింగ్ విషయాలు

14 March 2026

రాత్రంతా మేల్కొంటున్నారా? ఈ హీరోయిన్ చెప్పిన ‘ఐ రోలింగ్’ టెక్నిక్‌తో నిమిషాల్లో గాఢనిద్రలోకి

14 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టైం అయిపోతోందని ఫాస్ట్‌గా తినేస్తున్నారా? ఈ 5 అనర్ధాల గురించి తెలిస్తే ఇంకెప్పుడూ అలా చేయరు

14 March 2026

మహేష్ బాబు ఫ్యాన్ ఫైర్.. చిక్కుల్లో పడ్డ డైరెక్టర్ హరీష్ శంకర్

14 March 2026

సమ్మర్‌‌లో చన్నీటి స్నానం చేస్తే జరిగేది ఇదే.. న్యూరాలజిస్టులు చెప్తున్న షాకింగ్ విషయాలు

14 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.