కొందరు ఎంత వయసు వచ్చినా దాని ప్రభావం చర్మంపై పడకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు పడకుండా ఉండాలంటే చర్మ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వయసు ప్రభావం చర్మంపై పడకూడదంటే క్రమం తప్పకుండా పాలు తాగాలి. పాలలో ప్రొటీన్, క్యాల్షియం ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ లాక్టోస్ అలర్జీ ఉన్న వాళ్లు పాలకు బదులు సోయా పాలను క్రమం తప్పకుండా తాగవచ్చు. దీని వల్ల చర్మంపై ముడతలు రావు.
చర్మ కాంతిని కాపాడుకోవడానికి ప్రతిరోజూ కనీసం ఒక కప్పు గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీ శరీరం నుంచి అదనపు టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఫలితంగా చర్మంపై ఒత్తిడి పడదు. దీంతో చర్మం తాజాగా ఉంటుంది. ఉదయం నిద్రలేచి ఒక కప్పు కాఫీ తాగితే శరీరం ఉల్లాసంగా ఉంటుంది. కాఫీ చర్మానికి కూడా మంచిది. చర్మ క్యాన్సర్, ఇతర వ్యాధులను నివారించడానికి ఈ పానీయం బలేగా సహాయపడుతుంది. కానీ మీరు ఎక్కువ కెఫిన్ తీసుకుంటే అది ప్రతికూలంగా పనిచేస్తుంది.
చర్మ ప్రకాశాన్ని కాపాడుకోవడానికి క్యారెట్లు బలేగా సహాయపడతాయి. క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మానికి మంచిదని పలు పరిశోధనలు సైతం చెబుతున్నాయి.
బీట్రూట్లో సహజ నైట్రేట్లు ఉంటాయి. ఇది మంచి రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. డయాబెటిస్ రోగులు మినహా మిగతా అందరూ బీట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగవచ్చు.
రోజూ ఉదయం ఒక గ్లాసు నిమ్మరసం తేనెను తాగడం వల్ల ఊబకాయాన్ని నివారించవచ్చు. పైగా ఈ పానీయం శరీరం నుంచి అదనపు మలినాలను కూడా సులువుగా తొలగిస్తుంది. పొట్టను చల్లగా ఉంచడానికి, చర్మం మెరుపును పునరుద్దరించడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు మజ్జిగ తాగవచ్చు. ఇది చర్మ మృదుత్వాన్ని కాపాడుతుంది. చర్మాన్ని తాజాగా, కాంతివంతంగా మారుతుంది.