Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

బాపురే.. బంగారు బొమ్మ.! ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? రీసెంట్‌గానే 300కోట్ల హిట్ కొట్టింది

21 June 2025

Numerology: ఈ 3 తేదీల్లో జన్మించిన వారు ఎప్పుడూ కోపంతో ఉంటారు.. కుటుంబాన్ని ప్రేమిస్తారు..

21 June 2025

ఇతను గురి పెడితే పతకం రావాల్సిందే..! మారుమూల తండా యువకుడి విజయ ప్రస్థానం

21 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Gadala Srinivas: గడల వీఆర్ఎస్‌కు లైన్ క్లియర్.. ఇంతకీ ఆయన దారెటు.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
తెలంగాణ

Gadala Srinivas: గడల వీఆర్ఎస్‌కు లైన్ క్లియర్.. ఇంతకీ ఆయన దారెటు.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

.By .18 August 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gadala Srinivas: గడల వీఆర్ఎస్‌కు లైన్ క్లియర్.. ఇంతకీ ఆయన దారెటు.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలంగాణ మాజీ హెల్త్‌ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌ రావు వీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గతంలో ఆయన రాజకీయ ఆశలు ఆవిరయ్యాయి. ఇపుడు ఏమి చేస్తారన్నదీ ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సర్కార్ హయాంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌‌గా ఉన్న గడల శ్రీనివాస్‌ రాజకీయంగా ఎగాలని ఆశపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొలిటికల్ పంచ్‌ డైలాగ్‌లు పేల్చుతూ జనంలోకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడొచ్చామ్‌ అన్నదికాదు బుల్లెట్‌ దిగిందా లేదా అంటూ సినిమా డైలాగ్‌లు దంచికొట్టారు. కొత్తగూడెం నా అడ్డా… ఇక్కడే పుట్టా, ఇక్కడ చస్తా అంటూ సెంటిమెంట్‌ కూడా పండించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచే బరిలోకి దిగుతానంటూ.. పవర్‌లో ఉండగానే, ర్యాలీలు, భేటీలతో హోరెత్తించారు. అయితే, కేసీఆర్‌ ఆశీస్సులు మాత్రం దక్కలేదు. చివరికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్చందంగా తప్పుకున్నారు.

హెల్త్ డైరెక్టర్ గా ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండి,అప్పటి సీఎం కేసీఆర్ కు పరమ భక్తుడిగా రాజకీయ నేతలా ఎదగాలనుకున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఉంటూనే, అతిగా రాజకీయ జోక్యం చేసుకుని, కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని హడావుడి చేశారు. చివరికి టికెట్ రాలేదు. ఆ తర్వాత ఎంపీ టికెట్ పై కర్చీఫ్ వేసినా.. ఫలితం దక్కలేదు. సీన్ కట్ చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో తన ఉద్యోగంలో కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర స్థాయి అధికారి నుంచి మహబూబాబాద్ అడిషనల్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ట్రాన్స్ ఫర్ చేసింది కొత్త సర్కార్. చివరికీ వీఆర్ఎస్ పెట్టుకోవడంతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇపుడు గడల పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా..? ఆయన దారెటు అనే చర్చ నడుస్తోంది..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా పని చేసిన గడల శ్రీనివాస్ రావు.. ఒక వెలుగు వెలిగారు. ఉన్నత అధికారి అనే కంటే అప్పటి సీఎం కేసీఆర్‌కు పరమ భక్తుడిగా డ్రామాలు ఆడారు. ఈయన గారి హడావుడి మాములుగా ఉండేది కాదు. టైం దొరికితే చాలు, ఆదివారం వచ్చిందంటే కొత్తగూడెంలో వాలిపోయేవారు. జీఎస్ఆర్ ట్రస్టు పేరుతో కొత్తగూడెంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమావేశాలు, సభలు, ర్యాలీలతో హడావుడి చేసేవారు. అవసరం లేకున్నా కేసీఆర్‌ను అతిగా పొగడటం, ఏకంగా ఒకసారి ఆయన కాళ్ల మీద పడ్డారు. ఇది అప్పట్లో చర్చకు దారి తీసింది. అయినా కేసీఆర్ కాళ్ళపై పడటాన్ని ఈయన సమర్థించుకున్నారు.

అవకాశం వస్తే.. కొత్తగూడెం ప్రజలు కు సేవ చేసుకుని పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని.. రాజకీయ నేతలాగా సభలు నిర్వహించి ఉపన్యాసాలు ఇచ్చేశారు. బీఆర్ఎస్ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తాను ఉన్నత స్థాయి అధికారి అనే విషయాన్ని మర్చిపోయి, రాజకీయ కార్యకలాపాలు..ఒక పార్టీ గా అనుకూలంగా నిర్వహించారు. దీంతో గడల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ హ్యాండ్ ఇచ్చాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు కొత్తగూడెం టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే టికెట్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో అడ్రస్ లేకుండా పోయారు. కొత్తగూడెం వైపే కన్నెత్తి చూడలేదు.

బీఆర్ఎస్ ఓడిపోవడం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. దీంతో ప్లేట్ మార్చి.. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీ టికెట్ కూడా రాలేదు. గడల రాజకీయ ఆశలు పూర్తిగా ఆవిరి అయ్యాయి. మారిన పరిణామాలతో అతని ఉద్యోగం లోనూ కష్టాలు మొదలయ్యాయి. మహబూబాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గా ట్రాన్స్ ఫర్ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు జులై 27న ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే జాబ్‌లో జాయిన్ కాకుండానే గడల శ్రీనివాస్ లాంగ్ లీవ్‌లో వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆమోదించడంతో.. ప్రస్తుతం అతను ఏమి చెయ్యబోతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఏదైనా పార్టీ నుంచి ఇస్తారా..; లేదా వెయిట్ చేస్తారా..; గడల దారెటు ..? అనే చర్చ జరు గుతోంది. అంతన్నాడు.. ఇంతన్నాడు చివరికి ఇలా అయ్యిందా.. అని అంటున్నారు కొత్తగూడెం పబ్లిక్..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rain Alert: తెలంగాణకు రెండు రోజుల పాటు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ !

21 June 2025

Bandi Sanjay: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సిట్ ?

21 June 2025

Hyderabad: తాను రాజకీయ నేతనంటూ బడా మోసం.. కట్‌చేస్తే.. పోలీసుల ఎంట్రీతో…

20 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

బాపురే.. బంగారు బొమ్మ.! ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? రీసెంట్‌గానే 300కోట్ల హిట్ కొట్టింది

21 June 2025

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తున్న…

Numerology: ఈ 3 తేదీల్లో జన్మించిన వారు ఎప్పుడూ కోపంతో ఉంటారు.. కుటుంబాన్ని ప్రేమిస్తారు..

21 June 2025

ఇతను గురి పెడితే పతకం రావాల్సిందే..! మారుమూల తండా యువకుడి విజయ ప్రస్థానం

21 June 2025

Jammalamadugu Rdo Cancel Gift Deed,ఐదుగురు బిడ్డలను కన్నా అనాథలుగా వృద్ధులు.. అధికారులు చేసిన పనితో దెబ్బకు దారికొచ్చారు.. – kurnool jammalamadugu rdo cancel gift deed due to daughter not take proper care of their parents

21 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

బాపురే.. బంగారు బొమ్మ.! ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..? రీసెంట్‌గానే 300కోట్ల హిట్ కొట్టింది

21 June 2025

Numerology: ఈ 3 తేదీల్లో జన్మించిన వారు ఎప్పుడూ కోపంతో ఉంటారు.. కుటుంబాన్ని ప్రేమిస్తారు..

21 June 2025

ఇతను గురి పెడితే పతకం రావాల్సిందే..! మారుమూల తండా యువకుడి విజయ ప్రస్థానం

21 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.