
అమెరికాతో భారత్ బందం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా మారింది. ఓవైపు మిత్రుడంటూనే.. ఆంక్షల కొరడా ఝలపిస్తోంది అమెరికా. ఓవైపు చైనాను ఢీకొట్టాలంటే అమెరికాకు కనిపిస్తున్న బుల్లెట్ పాయింట్ బారతే. అందుకే అమెరికా ఫస్ట్ విధానంతో ఆంక్షలు కురిపిస్తూనే.. డిఫెన్స్ డీల్‌తో మనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. మరి అమెరికా ఆడుతున్న గేమ్‌లో భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతోంది..? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.
2025 ఫిబ్రవరి 13న భారత ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌ను కలిసినప్పుడు.. మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే లెవల్లో ఆలింగనాలు, చర్చలు జరిగాయి. కానీ అమెరికా స్నేహం వెనుక ట్రేడ్ టారిఫ్‌లు, ఇమిగ్రేషన్ డ్రామాలు, చైనాతో ఛాలెంజ్‌లు మనల్ని ఆలోచనలో పడేశాయి. భారత్ మిత్రదేశమే.. బట్ రూల్స్ ఫాలో కావాల్సిందే అంటూ ట్రంప్ బిజినెస్ స్ట్రోక్ ఇచ్చాడు. భారత్‌పై 26% రెసిప్రోకల్ టారిఫ్‌లు ప్రకటించాడు. గతంలో 3-4% మాత్రమే ఉన్న సుంకం.. ఇప్పుడు ఆకాశాన్ని తాకే పరిస్థితి. ఈ సుంకాల ఎఫెక్ట్‌కు ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ ఎగుమతులు కుదేలయ్యాయి. కానీ, ఇక్కడే ట్విస్ట్ దాగుంది. ప్రధాని మోదీ అమెరికన్ ఆయిల్, గ్యాస్ ఇంపోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, టారిఫ్ టెన్షన్‌ను కొంత సమతుల్యం చేశారు….
సుంకాల ఎఫెక్ట్ భారత్‌పై ప్రభావం చూపుతున్నా.. అమెరికా-భారత్ మధ్య రక్షణ సహకారం ఊపందుకుంది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా-యూఎస్ రక్షణ ఒప్పందం.. భారత్ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేస్తోంది. చైనా డ్రాగన్‌ను ఢీకొట్టాలంటే.. భారత్‌తో జట్టు కట్టాలన్నదే ట్రంప్ వ్యూహం. ఇందులో భాగంగా అమెరికా నుంచి 8 బిలియన్ల డాలర్ల విలువైన రక్షణ దిగుమతులతో భారత సైన్యం అప్‌గ్రేడ్ అవుతోంది. అలాగని అప్పుడే సంబరపడలేం. అమెరికా ఎజెండాకు భారత్ పూర్తిగా లొంగిపోకూడదంటున్నారు నిపుణులు. ఆయుధాలు ఇస్తాం, కానీ మా రూల్స్ పాటించాల్సే అంటున్న ట్రంప్ మన స్వేచ్ఛను లాగేసే అవకాశం ఉంది. ఇక్కడ భారత్ అప్రమత్తంగా ఉండాలంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.
ట్రంప్ ఉగ్రవాదంపై భారత్‌కు గట్టి మద్దతు ఇచ్చాడు. 2025లో ముంబై దాడుల కుట్రదారు తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించడం అత్యంత కీలమైన విషయం. భారత్‌కు దెబ్బ తగిలితే తాము చూస్తూ ఊరుకోమన్న మెసేజ్ అమెరికా నుంచి చాలా స్పష్టంగా వచ్చింది. జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా లాంటి గ్రూపులపై అమెరికా తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. పాకిస్థాన్‌ను కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరిస్తోంది. అంతేకాదు ట్రంప్ చైనాపై ఫోకస్‌తో ఇండో-పసిఫిక్‌లో భారత్‌ను సూపర్‌స్టార్‌గా చూస్తున్నారు. ఈ విషయంలో నో డౌట్.
2025లో ప్రారంభమైన ఇండియన్ ఓషియన్ స్ర్టాటజిక్ వెంచర్ భారత్-అమెరికా సహకారాన్ని ఆర్థిక, రక్షణ రంగాల్లో మరింత బూస్టప్‌ని ఇచ్చేలా చేస్తోంది. QUAD సమావేశాలు చైనాకు గట్టి కౌంటర్ అటాక్. 2025లో ఢిల్లీలో జరగనున్న QUAD సమ్మిట్‌లో ట్రంప్ స్వయంగా హాజరవుతారని టాక్. “చైనా గేమ్ ఆడితే, QUADతో భారత్ చెక్‌మేట్ అవుతుందన్న చర్చ గ్లోబల్ వైజ్ జరుగుతోంది. కానీ, ట్రంప్ రష్యాతో రాపో బిల్డ్ చేస్తున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు విశ్లేషకులు. రష్యా-భారత్ డిఫెన్స్ బంధం అమెరికా ఎన్నటికీ ఒప్పుకోదు. అందుకే చైనాతో ఫైట్ చేయ్, కానీ రష్యాతో రొమాన్స్ ఆపు అన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది భారత్‌ను ఇబ్బందుల్లో పెట్టే అంశం. అంతేకాదు 2024లో గౌతమ్ అదానీపై అమెరికా ఆరోపణలు, సిఖ్ పై హత్యాయత్నం ఆరోపణలు లాంటివి అమెరికాతో సంబంధాలను టెన్షన్లో పడేసే అంశాలు. అందుకే అమెరికా స్నేహంపై భారత్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటారు నిపుణులు
ట్రంప్ చైనాపై యుద్ధం ప్రకటించడంతో, భారత్‌కు గ్లోబల్ సప్లై చైన్‌లో స్టార్‌గా ఎదిగే ఛాన్స్ వచ్చింది. 2025లో మెటా ఇండియన్ ఓషన్‌లో 50 బిలియన్ డాలర్ల అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. దీంతో భారత్ డిజిటల్ హబ్‌గా మారే అవకాశం ఉంది. చైనా బై, ఇండియా హాయ్..అంటూ గ్లోబల్ కంపెనీలు కూడా భారత్‌తో ట్యూన్ అవబోతున్నాయి. అలాగే టెస్లా, స్టార్‌లింక్ లాంటి అమెరికన్ బిగ్షాట్లు భారత్‌లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు వేస్తున్నాయి. ఇండియా ఎక్స్పోర్ట్-ఫ్రెండ్లీ పాలసీలు అమెరికన్ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్‌లతో కొడితే.. తాము ఇన్వెస్ట్మెంట్లతో గెలుస్తాం అన్నట్టుగా భారత్ ధీమాగా ఉందిప్పుడు. మొత్తానికి ట్రంప్ టారిఫ్‌లు, వీసా ఆంక్షలతో భారత్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. డిఫెన్స్ డీల్స్, అమెరికాతో చైనా గ్యాప్ మనల్ని ఆకాశానికి తీసుకెళ్తున్నాయి. భారత్ ఈ గేమ్‌లో గెలవాలంటే, స్వావలంబన, స్మార్ట్ డిప్లొమసీ కీలకం అన్నది విశ్లేషకుల మాట..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..