రజత్ పాటిదార్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించాడు. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగిన పాటిదార్ కేవలం 30 ఇన్నింగ్స్‌లలో 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసి అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనతతో అతను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌లను అధిగమించాడు, వారు ఈ మైలురాయిని 31 ఇన్నింగ్స్‌లలో చేరారు. తిలక్ వర్మ 33 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. అయితే పాటిదార్ 1000 పరుగులను 35 కంటే ఎక్కువ సగటుతో, 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక సంపాదించాడు. ఈ రికార్డు అతని స్థిరత్వం, ప్రభావవంతమైన ఆటతీరు, ముఖ్యంగా టెన్షన్ భరితమైన మ్యాచ్‌లలో అతను చూపిన దూకుడును ప్రతిబింబిస్తుంది. అతను ప్రస్తుత T20 క్రికెట్లో అత్యంత ఆసక్తికరమైన యువ భారతీయ బ్యాట్స్మన్లలో ఒకరిగా నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, వర్షం కారణంగా ఆలస్యం అయిన ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు పరిమితం చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబి తరపున టిమ్ డేవిడ్ 26 బంతుల్లో 50 పరుగులతో అర్ధ సెంచరీ చేయగా, మొత్తం జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయిన 95 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సెన్ కీలక వికెట్లు తీసి ఆర్సీబిని కష్టాల్లోకి నెట్టారు. లక్ష్యచేధనలో పంజాబ్ కింగ్స్ జట్టు 12.1 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. నెహాల్ వాధేరా 19 బంతుల్లో 33 పరుగులతో చమకగా ఆడాడు. ఆర్సీబి తరపున జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు తీసి ప్రభావశీలంగా బౌలింగ్ చేసినా, మిగిలిన బౌలర్లు సరైన మద్దతు ఇవ్వగా జట్టు ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్ ఓటమితో పాటు పాటిదార్ చేసిన రికార్డు మాత్రం RCB అభిమానులకు గర్వించదగ్గ విషయం అయింది. ఐపీఎల్లో భారత క్రికెటర్లలో ఒక కొత్త మెరుగైన బ్యాట్స్‌మన్ ఎదుగుతున్నాడనే సంకేతాన్ని అతని ప్రదర్శన ఇచ్చింది. రాబోయే మ్యాచ్‌లలో కూడా పాటిదార్ ఇలాగే నిలకడగా రాణిస్తే, జట్టుకు మాత్రమే కాకుండా దేశవాళీ టీ20 క్రికెట్‌కి కూడా ఒక గొప్ప ఆస్తిగా మారనున్నాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..