వివిధ కోర్సుల ఫలితాలు, ఎంట్రాన్స్ ఎగ్జామ్ల రిజల్ట్స్ రానున్న నేపథ్యంలో పలు కాలేజ్‌లు, కోచింగ్ సెంటర్లు యాడ్స్ ఇస్తుంటాయి. టాప్ టెన్‌లో అన్ని ర్యాంకులు, ఇన్ని ర్యాంకులు వచ్చాయని.. ఆ ర్యాంకులు మావే.. ఈ ర్యాంకులు మావే అని హోరెత్తిస్తుంటాయి. అయితే.. కొన్ని కోచింగ్ సెంటర్లు, సంస్థలు తప్పుడు ప్రకటనలు ఇవ్వడంపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ యాక్షన్ తీసుకుంటోంది. ప్రధానంగా.. IIT-JEE, NEET, UPSC లాంటి పోటీ పరీక్షల ఫలితాల్లో కొన్ని కోచింగ్ సెంటర్స్ ఫేక్ యాడ్స్ ఇచ్చినట్లు గుర్తించింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న కోచింగ్ సెంటర్స్‌పై వినియోగదారుల రక్షణ చట్టం-2019ని ప్రయోగించింది. ఫేక్స్ యాడ్స్ ఇస్తున్న దేశంలోని 24 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేయడంతోపాటు.. 77లక్షల 60వేల జరిమానా విధించింది.
పోటీ పరీక్షల ఫలితాల విడుదల తర్వాత తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేస్తే తాట తీస్తామని CCPA మరోసారి హెచ్చరించింది. అన్ని కోచింగ్ సెంటర్లు రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచించింది. కోచింగ్ సెంటర్స్ యాడ్స్‌లో అభ్యర్థి పేరు, ర్యాంక్, కోర్సు లాంటి కీలక వివరాలను క్లారిటీగా ప్రకటించాల్సిందేనని ఆదేశించింది. గతంలోనూ ఫేక్ యాడ్స్ జారీ చేసిన కోచింగ్ సెంటర్లకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటక్షన్ అథారిటీ జరిమానా విధించింది. మూడు కోచింగ్ సెంటర్లకు ఒక్కోదానికి ఏడు లక్షల రూపాయల చొప్పున ఫైన్ వేసింది. మరో కోచింగ్ సెంటర్‌కు లక్ష జరిమానా విధించింది. మొత్తంగా.. త్వరలో పలు ఎంట్రాన్స్ ఎగ్జామ్ల రిజల్ట్స్, పోటీ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్న వేళ కోచింగ్ సెంటర్లను CCPA హెచ్చరిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..