హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. వేగంగా మంటలు వ్యాపించడంతో వార్డులలో నుంచి బ సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే, ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సిబ్బంది తెలిపారు. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రాణనష్టం, క్షతగాత్రులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఎమర్జెన్సీ వార్డు కావడంతో పేషెంట్స్ ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరయ్యారని, పేషెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..