దేశముదురు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హాన్సిక. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో మెరిసింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. పెళ్లి తర్వాత సైతం సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్, మూవీస్ చేస్తుంది. ఇక గతేడాది హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ డ్రామా గార్డియన్. ఫిల్మ్ వర్క్స్ బ్యానర్ పై విజయ్ చందర్ నిర్మించిన ఈ మూవీకి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. తమళంలో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేయగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది.
ఈ సినిమాలో సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలకపాత్రలలో నటించారు. హారర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పా్న్స్ వచ్చాయి. హాన్సిక నటించిన ఈ హారర్ డ్రామా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత హాన్సిక మరో సినిమా చేయలేదు. తెలుగులో చివరగా 105 మినట్స్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం నషా పేరుతో తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే పలు టీవీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.
కథ విషయానికి వస్తే..
రోటిన్ హారర్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకును అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అపర్ణ అనే ఇంటీరియర్ డిజైనర్ పాత్రలో నటించింది హన్సిక. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహయంతో సిటీలోని పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్నవారిపై ఆత్మ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది ? అసలు ఆ ఆత్మ ఎవరు? అనేది సినిమా.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..