సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు తమకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైనచేదు అనుభవాల గురించి స్పందిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి దైర్యంగా మీడియా ముందు మాట్లాడారు. అవకాశాల కోసం అమ్మాయిలను లోబరుచుకునే వారు చాలా మంది ఉన్నారు అని కొందరు హీరోయిన్ చెప్పుకొచ్చారు. అలాగే నిర్మాతలు, దర్శకులు కమిట్ మెంట్స్ అడుగుతారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రతి ఇండస్ట్రీలో ఈ సమస్య ఉంటుందని.. కానీ దైర్యంగా మనం వాటిని తిప్పికొట్టాలని చాలా మంది చెప్పుకొచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయం చెప్పింది. కొత్త హీరోయిన్స్ ఎవరైనా సరే ఆ హీరో బెడ్ ఎక్కాల్సిందే అని తెలిపి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?
క్యాస్టింగ్ కౌచ్ అనేది అంతటా ఉంది. కాకపోతే సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా దీని గురించి వార్తలు వస్తూ ఉంటాయి. ఇక హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటారు. అయితే సోషల్ మీడియా వల్ల కూడా కొంతమంది లేనిపోని ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రతీకా రావు ఓ హీరో బండారాన్ని బయట పెట్టింది.
సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రతీక రావు హర్షద్ అరోరాకు సంబంధించిన సినిమాలోని ఓ రొమాంటిక్ సీన్ ను షేర్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. అటుతిరిగి ఇటుతిరిగి అది ప్రతీక కంట్లో పడింది. దాంతో ఆ వీడియోను తొలగించమని రిక్వెస్ట్ చేసింది. దానికి ఆ నెటిజన్స్ సినిమాల్లో చేసినప్పుడు లేదా అంటూ అడ్డగోలు సమాధానం చెప్పాడు. దాంతో ఆమెకు కోపం వచ్చి కొన్ని సీన్స్ అప్పటికప్పుడు షూట్ చేస్తారు. ముందుగా అనుకోకుండా స్పాట్ లో సీన్ మారుస్తారు. ఆ సీన్ కూడా అలా చేసిందే.. అసలే ఆ హీరో కొత్త హీరోయిన్స్ ను వదిలిపెట్టడు. కొత్త హీరోయిన్స్ ను తన బెడ్ మీదకు లాగేవరకు అతను వదిలిపెట్టడు. అతనితో ఉన్న నా వీడియోను దయచేసి తొలగించు అంటూ రిక్వెస్ట్ చేసింది. ఈకామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ అమ్మడు తెలుగులో వరుణ్ సందేశ్ తో కలిసి లవర్ బాయ్ అనే సినిమా చేసింది. ప్రస్తుతం తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ప్రతీక రావు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి