శుక్రవారం (25-04-25) శ్రీకాకుళం జిల్లా -4, విజయనగరం-5, పార్వతీపురం మన్యం -8… ఇలా రాష్ట్రంలోని మొత్తం 17 మండలాల్లో తీవ్రవడగాలులు, 21 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శనివారం 12 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం శ్రీకాకుళం-1, విజయనగరం-10, పార్వతీపురంమన్యం -7, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శని, ఆది వారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వడగాలులు వీచే మండలాల వివరాలు లింక్లో చెక్ చేయండి…
https://apsdma.ap.gov.in/files/1ccbe5a9542395485ac84bec3eb2bffd.pdf
గురువారం నంద్యాల జిల్లా దోర్నిపాడులో 43.8°C, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో 43.7°C, వైఎస్సార్ జిల్లా అట్లూరులో 43.6°C, విజయనగరంలో 42.8°C, కర్నూలు జిల్లా కామవరం, పల్నాడు జిల్లా నర్మలపాడులో42.7°C,ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 42.4°C, నెల్లూరు జిల్లా మనుబోలు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో42.1°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, అలాగే 139 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు.
బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదు. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పడేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..