జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో అమరులైన అమాయక ప్రజలను స్మరించుకుంటూ అఖిలపక్ష సమావేశంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.
#WATCH | Delhi: All-party meeting called by the Central Government underway at the Parliament Annexe building
Union HM Amit Shah, Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar are also present
#PahalgamTerroristAttack pic.twitter.com/Ntt27DETDo
— ANI (@ANI) April 24, 2025
మరోవైపు ఇప్పటికే ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేసింది. అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను మూసివేసింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్ జాతీయులకు భారత్‌లోకి ప్రవేశం నిషేధించింది. దీని కింద గతంలో ఇచ్చిన వీసాలూ రద్దు చేసింది. భారత్‌లోని పాక్ హైకమిషన్‌లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో భారత్ సైతం ఇస్లామాబాద్‌లో ఉన్న త్రివిధ దళాల సలహాదారుల్ని ఉపసంహరించుకుంటుందని వెల్లడించింది. ఇరు వైపులా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని నిర్ణయించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…