ఇప్పటికైనా మగవారు భార్యలు తీసుకునే నిర్ణయాలను, వారి ముందు చూపును గుర్తించాల్సి అవసరం ఉందని ఈ పోస్ట్ తెలియజేస్తుంది. భారతీయ కుంటుంబాల్లో డబ్బును బంగారం రూపంలో పొదుపు చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీగా ఉంది. దీనిని కేవలం చిన్న పొదుపుగా మాత్రమే అనుకోవడానికి లేదు. ఒకప్పుడు చిన్నా చితకా పోగు చేసి జమ చేసిన బంగారమంతా ఇప్పుడు ఏకంగా లక్షల్లో ధర పలకడం నిజంగా అద్భుతం. ఈ దెబ్బతో ఎప్పటినుంచో బంగారం కూడబెడుతున్న కుటుంబాలన్నీ లక్షాధికారులుగా మారడం ఖాయం. ఇదే విషయాన్ని ఈ ప్రముఖ బిజినెస్ మ్యాన్ హైలెట్ చేశాడు.
ఇంతకీ పోస్ట్ లో ఏముంది?
ఆర్థిక విషయాలను నెరపడంలో భార్యలకు మించిన వారు లేరని ఈ దెబ్బతో మరోసారి రుజువు చేశారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ హాస్యాస్పదమైన పోస్ట్ ను షేర్ చేశాడు. భార్యలు తెలివైన వారు అంటూ మహిళలను ప్రశంసించాడు.
‘‘10 సంవత్సరాల క్రితం, నేను రూ.8 లక్షలకు కారు కొన్నాను. ఆమె రూ.8 లక్షలకు బంగారం కొంది.
ఇప్పుడు- కారు విలువ రూ.1.5 లక్షలు. ఆమె బంగారం? రూ.32 లక్షలు.
నేను అన్నాను, “బంగారం వద్దు, వెకేషన్‌కి వెళ్దాం?”
ఆమె అంది, “వెకేషన్ 5 రోజులు ఉంటుంది. బంగారం 5 తరాల వరకు ఉంటుంది.”
నేను రూ.1 లక్షకు ఫోన్ కొన్నాను. ఆమె బంగారం కొంది.
ఇప్పుడు? ఫోన్ విలువ రూ.8 వేలు. ఆమె బంగారం? రూ.2 లక్షలు.
నీతి: భార్యలు తెలివైనవారు.’’
10 yrs ago, I bought a car for ₹8L. She bought gold for ₹8L.Today- car’s worth ₹1.5L. Her gold? ₹32L.
I said, “Let’s skip gold, go on a vacation?”She said, “Vacation lasts 5 days. Gold lasts 5 generations.”
I bought a phone for ₹1L. She bought gold.Now? Phone’s worth…
— Harsh Goenka (@hvgoenka) April 23, 2025
ఈ కథ భారతీయ కుటుంబాలలో బంగారం కొనుగోలు చేయడంలో మహిళలు తీసుకునే దూరదృష్టి నిర్ణయాలను సరదాగా హైలైట్ చేశారు. గోయెంకా తన పోస్ట్‌లో బంగారం ధరలు 1970ల నుండి 2025 వరకు ఎలా పెరిగాయో డేటా ద్వారా చూపించారు, దీనిని ఒక స్థిరమైన పెట్టుబడిగా నొక్కి చెప్పారు.
బంగారంలో పెట్టుబడి ఎందుకు తెలివైన నిర్ణయం?
స్థిరత్వం: బంగారం ధరలు ఆర్థిక సంక్షోభ సమయాల్లో కూడా స్థిరంగా లేదా పెరుగుతాయి, ఇది స్టాక్ మార్కెట్ లేదా ఇతర అస్థిర ఆస్తులకు వ్యతిరేకంగా సురక్షిత ఎంపికగా చేస్తుంది.
ద్రవ్యోల్బణ రక్షణ: బంగారం ద్రవ్యోల్బణ రేటుతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా వృద్ధి చెందుతుంది, దీనివల్ల కొనుగోలు శక్తి కాపాడబడుతుంది.
వైవిధ్యీకరణ: బంగారం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడంలో సహాయపడుతుంది, మొత్తం రిస్క్‌ను తగ్గిస్తుంది.
లిక్విడిటీ: బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు, ఇది అత్యవసర సమయాల్లో నగదు అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. గోయెంకా షేర్ చేసిన పోస్ట్ ఈ ప్రయోజనాలను ఆచరణాత్మక ఉదాహరణల ద్వారా వివరించింది. బంగారం కొనుగోలు చేయడం ఎలా ఆర్థిక భద్రతను అందిస్తుందో చూపించింది.