కొంతమంది హీరోయిన్లకి అందం ఉన్నా అదృష్టం ఉండదు. అందులో అందరికంటే ముందొచ్చే హీరోయిన్ రాశీ ఖన్నా. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళైనా.. పాతిక సినిమాలకు పైగానే నటించినా.. క్రేజీ హీరోలతో జోడీ కట్టినా.. పాపం ఈ పాప లక్కు మాత్రం మారలేదు.
ఈమెతో పాటు వచ్చిన చాలా మంది టాప్ రేంజ్‌కు వెళ్లినా.. రాశీ మాత్రం మీడియం రేంజ్‌లోనే ఆగిపోయారు. ఏదో తమిళ, హిందీ సినిమాలతో లాక్కొస్తున్నారు కానీ తెలుగులో అయితే రాశీ ఖన్నా కెరీర్ ఎప్పుడో చరమాంకానికి చేరుకున్నట్లే కనిపిస్తుంది.
అప్పుడెప్పుడో కరోనా కంటే ముందొచ్చిన ప్రతిరోజు పండగేతో చివరి హిట్ కొట్టారు రాశీ. ఆ తర్వాత ఈమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో ఈమెకు ఆఫర్స్ కరువయ్యాయి.
తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన తెరకెక్కిస్తున్న తెలుసు కదా..లో నటిస్తున్నారు రాశీ. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమా ఇదొక్కటే. దాంతో ఆప్షన్ లేక సోషల్ మీడియాలో బికినీ షో చేస్తున్నారు ఈ భామ.
తాజాగా ఈమె హాట్ ఫోటోషూట్ ట్రెండ్ అవుతుంది. ఆఫర్స్ రావాలంటే.. ఈ మాత్రం గ్లామర్ షో చేయక తప్పదని ఫిక్సైపోయారు రాశీ. మరి ఇదైనా ఆమెకు కలిసొస్తుందా లేదా చూడాలి.