పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో భయం మొదలైందా..? భారత్ కఠిన వైఖరితో దాయాది దేశం వణికిపోతోందా? అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలుస్తుండడంతో పొరుగు దేశాలతో పాక్ కాళ్ల కింద భూకంపం వచ్చినంత పని అవుతోంది. ఆపరేషన్ త్రిశూల్. చుక్క నెత్తురు చిందించకుండానే పాకిస్తాన్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. డైరెక్ట్ వార్ చేయకుండానే, పరోక్ష యుద్ధంతో పాక్‌ని షేక్ చేస్తోంది. ఈ ముప్పేట దాడితో పాక్ విలవిల్లాడిపోతోంది. మొన్న వాటర్ బాంబ్ ఒత్తిని అంటించింది భారత్. అది ఇప్పుడు పేలడంతో పాక్ బెంబేలెత్తిపోతోంది. ఇక టెర్రరిస్టులకు తల దాచుకునేందుకు వీలు లేకుండా వేటలో వేగం పెంచింది.
పహల్గామ్ ఘటనను సీరియస్‌గా తీసుకున్న భారత్, పాకిస్థాన్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇప్పటికే వీసాలు రద్దు చేసి దేశం నుంచి పాకిస్థానీయులను పంపించేసిన భారత్, ఉగ్రవాదులను తుదముట్టించేందుకు అన్ని శక్తులు ప్రయోగిస్తోంది. భారత్ వైఖరితో తర్జనభర్జన అవుతున్న పాకిస్తాన్.. ఉగ్రదాడిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమ పాత్రేమీ లేదంటూ ఒకరోజు.. యుద్ధానికి సిద్ధమంటూ మరోసారి వ్యాఖ్యలు చేస్తూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అయితే పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదులు మాత్రమే కాదు, దాని అగ్ర నాయకులు, అధికారులు కూడా భారత్ ప్రతీకార చర్యకు భయపడుతున్నారు. స్థానిక కథనాల ప్రకారం, పాకిస్తాన్ సైనిక అధిపతి కుటుంబం పాకిస్థాన్ విడిచిపెట్టిన తర్వాత, ఇప్పుడు పిపిపి అధ్యక్షుడు బిలావల్ భుట్టో కుటుంబం కూడా పాకిస్తాన్ విడిచి కెనడా వెళ్లిపోయింది.
వారితో పాటు, పాక్ జాయింట్ చైర్పర్సన్ షంషాద్ మీర్జాతో సహా అనేక మంది ముఖ్య అధికారుల కుటుంబాలు దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం. దీన్ని బట్టి భారతదేశం ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్లో ఎంత భయం వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడి తర్వాత, దాడి చేసిన వారికి ఊహకు మించిన శిక్ష పడుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరిక జారీ చేశారు.
After families of Pak Army Chief General Asif Munir, DG ISPR Lt Gen Asif Malik & CJCSC Gen Sahir Shamshad Mirza, now families of Lt General Nauman Zakaria and Lt General Inam Haider Malik also left Pak and have flown for Australia and Canada this morning.
— Halesh Singh🇮🇳 (@HaleshSingh) April 27, 2025
పాకిస్తాన్‌కు నిరంతరం హాని కలిగించే సీమాంతర చర్య తీసుకునే ముందు భారతదేశం అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. సింధు ఒప్పందంతో పాటు, భారతదేశం పాకిస్థానీల వీసాలను కూడా నిలిపివేసింది. అనేక పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించారు.
ఏప్రిల్ 22న, కాశ్మీర్ లోయలోని పహల్గామ్లో పర్యాటకులపై సుమారు 5 మంది దుండగులు దాడి చేసి, 26 మందిని కొట్టనపెట్టుకున్నారు. ఈ పిరికిపందా చర్చ తర్వాత, దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. ఈ దాడిని పోత్సహించిన పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసారి భారత సైన్యం పాకిస్తాన్‌కు పూర్తి చికిత్స అందించాలనే మూడ్‌లో ఉంది. ఈ కారణంగానే పాకిస్తాన్ నాయకులు, సైన్యాధికారులు, ఉన్నతాధికారుల కుటుంబాలు దేశం విడిచి వెళ్తున్నాయని సమాచారం.
Pakistan/Canada: Bilawal Bhutto’s family reportedly fled to Canada as Pakistan faces deepening instability.
— @GlobalGlimpse (@HimanshuSh80843) April 28, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..