ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఆయన శరీరంపై 53 కత్తిపోట్లు ఉండటం సంచలనంగా మారింది. ఒక్కో కత్తిపోటుకు రెండు లక్షల రూపాయల ఒప్పందం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఈ హత్యకు మూడు నెలల ముందు నుంచే పథకం రచించారని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హత్యలో కీలకంగా ఉన్నారని అనుమానపడుతున్న వ్యక్తి కోసం హైదరాబాద్, విశాఖలో పోలీసులు గాలిస్తున్నారు.

ఈ క్రమంలోనే వీరయ్య చౌదరి హత్య కేసు విషయంలో మరో కీలక అప్ డేట్ వచ్చింది. వీరయ్య చౌదరి శరీరంపై 53 కత్తిపోట్లు ఉండగా.. కత్తి పోటుకు రూ. 2 లక్షల చొప్పున ఒప్పందం జరిగినట్లు తెలిసింది. దీని కారణంగా దుండగులు అత్యంత దారుణంగా వీరయ్య చౌదరిపై దాడికి తెగబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరయ్య చౌదరి హత్య కోసం మూడు నెలల ముందే ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు రెండు వారాల ముందు ఒంగోలుకు చేరుకుని.. శివార్లలోని ఓ లాడ్జిలో మకాం వేసినట్లు భావిస్తున్నారు. ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి వీరయ్య చౌదరిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసులో కీలకంగా ఉన్న నిందితుడి కోసం విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాలలో పోలీసులు గాలిస్తున్నారు.
ఇక వీరయ్య చౌదరి హత్య కేసులో స్థానిక వ్యక్తులే కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మనబ్రోలుకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. రేషన్ మాఫియా డాన్‌గా చెప్పుకునే ఓ వ్యక్తిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే వీరయ్య చౌదరి హత్యకు సూత్రధారిగా ఉన్న ఓ కీలకమైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హత్య సమయంలో అతను హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో అతని కోసం విశాఖపట్నం, హైదరాబాద్‌లలో పోలీసులు గాలిస్తున్నారు. అలాగే వీరయ్య చౌదరి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు భావిస్తున్న ఓ యువకుడి కోసం కూడా పోలీసుల వేట సాగుతోంది.