Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రాత్రి పడుకునే ముందు ఒక్క స్పూన్ ఇసబ్‌గోల్.. ఉదయానికి ఈ అద్భుత మార్పులు చూసి ఆశ్చర్యపోతారు!

31 May 2026

Mumbai Indians : ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన..హార్దిక్ పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్

31 May 2026

Tollywood : స్టార్ హీరో కావాల్సినోడు.. ఒక్క రాత్రితో జీవితం ముగిసిపోయింది.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..

31 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Drunken Police Hulchal In Tirumala,తిరుమల కొండపై మరో అపచారం.. రోజు గడవకముందే.. ఏంటిది గోవిందా! – after namaz incident is forgotten another mischief in tirumala
ఆంధ్రప్రదేశ్

Drunken Police Hulchal In Tirumala,తిరుమల కొండపై మరో అపచారం.. రోజు గడవకముందే.. ఏంటిది గోవిందా! – after namaz incident is forgotten another mischief in tirumala

.By .23 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Drunken Police Hulchal In Tirumala,తిరుమల కొండపై మరో అపచారం.. రోజు గడవకముందే.. ఏంటిది గోవిందా! – after namaz incident is forgotten another mischief in tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో అన్యమతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేసిన ఘటన మరువకముందే మరో అపచారం జరిగింది. బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులే.. మద్యం తాగి కొండపైకి చేరుకున్నారు. మద్యం మత్తులో తమ వాహనంతో మరో వాహనాన్ని ఢీకొట్టి హల్ చల్ చేశారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. ముగ్గురు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఈ అపచారానికి పాల్పడ్డారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం.

తిరుమల కొండపై మరో అపచారం
తిరుమల కొండపై మరో అపచారం (ఫోటోలు– Samayam Telugu)

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. ఎవరైనా తప్పుచేస్తే దండించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించి.. విమర్శలపాలయ్యారు. ముగ్గురు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు మద్యం సేవించి తిరుమల కొండపైకి చేరుకోవటమే కాకుండా.. వాహనం నడుపుతూ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో జరిగింది. తిరుమలలోని గోపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తమ వాహనంలో కొండపైకి వచ్చిన ముగ్గురు పోలీసులు తమ వాహనాన్ని కర్ణాటకకు చెందిన భక్తుల వాహనంతో ఢీకొట్టారు. వేగంగా ఢీకొట్టటంతో వాహనం టైరు కూడా పంక్చర్ అయ్యింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ముగ్గురు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులకు బ్రీత్‌అనలైజర్ టెస్ట్ చేయగా.. 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి కూడా స్పందించినట్లు సమాచారం. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. నిబంధనలు అతిక్రమించిన వారు పోలీసులైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు సమాచారం.

మరోవైపు గురువారం కూడా తిరుమలలో భద్రతా వైఫల్యాన్ని బయటపట్టే ఘటన చోటుచేసుకుంంది. తిరుమలలో అన్యమత ప్రచారం పూర్తిగా నిషేధం కాగా.. గురువారం ఓ వ్యక్తి నమాజ్ చేయటం కలకలం రేపింది. తిరుమలలోని పాపవినాశనం రోడ్డులోని కళ్యాణవేదిక సమీపంలోని పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్య మతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. సీసీ కెమెరాలకి ఎదురుగానే ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పటికీ తిరుమలలోని భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా తిరుమల శ్రీవారి భక్తులు మండిపడ్డారు. తిరుమలలో ఇలా చేయడం ఏమిటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మరువకముందే మరోసారి తిరుమలలో మద్యం తాగి పోలీసులు హల్ చల్ చేయడం కలకలం రేపింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Rains,ఏపీకి వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ – andhra pradesh weather update trough brings rains to rayalaseema heatwave to grip 17 mandals

31 May 2026

Ap Diet Charges,ఏపీ విద్యార్థులకు సర్కార్ తీపి కబురు.. త్వరలో డైట్ ఛార్జీల పెంపు – ap government decides to increase diet charges for hostel and gurukul students

31 May 2026

సింగపూర్ టాంజాంగ్ టెర్నినల్ తరహాలోనే విశాఖ పోర్టులో.. పవన్ కళ్యాణ్ కొత్త ఆలోచన

30 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రాత్రి పడుకునే ముందు ఒక్క స్పూన్ ఇసబ్‌గోల్.. ఉదయానికి ఈ అద్భుత మార్పులు చూసి ఆశ్చర్యపోతారు!

31 May 2026

మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల నేడు చాలామంది మధుమేహం, తీవ్రమైన జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి ఇసబ్‌గోల్‌…

Mumbai Indians : ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన..హార్దిక్ పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్

31 May 2026

Tollywood : స్టార్ హీరో కావాల్సినోడు.. ఒక్క రాత్రితో జీవితం ముగిసిపోయింది.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..

31 May 2026

ఈ ఆలయానికి వెళ్తే ఇక అనారోగ్య సమస్యలకు గుడ్ బై..! | Karkateswara swamy Temple at Tirundudevankudi special powers and Sacred Shiva Shrine In Kumbakonam

31 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రాత్రి పడుకునే ముందు ఒక్క స్పూన్ ఇసబ్‌గోల్.. ఉదయానికి ఈ అద్భుత మార్పులు చూసి ఆశ్చర్యపోతారు!

31 May 2026

Mumbai Indians : ముంబై ఇండియన్స్‌లో భారీ ప్రక్షాళన..హార్దిక్ పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్

31 May 2026

Tollywood : స్టార్ హీరో కావాల్సినోడు.. ఒక్క రాత్రితో జీవితం ముగిసిపోయింది.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..

31 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025543

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025496

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.