Vijayawada Fire Accident Three Died: విజయవాడలో ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగి ముగ్గురు మరణించడంతో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మరోవైపు ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. కృష్ణా జిల్లా పామర్రులో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్య అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. ఈ ఘటనలన్నీ విజయవాడలో తీవ్ర విషాదాన్ని నింపాయి.
హైలైట్:
- విజయవాడలో అగ్నిప్రమాదం
- భవనంలో చెలరేగిన మంటలు
- ముగ్గురు అక్కడే చనిపోయారు

మరోవైపు విజయవాడలోని ఎల్ఐసీ భవనానికి బాంబ్ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. నగరంలోని బీసెంట్ రోడ్డులో ఉన్న ఎల్‌ఐసీ భవనానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి ఎల్‌ఐసీ భవనంలో బాంబు పెట్టినట్లు బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్ బీసెంట్ రోడ్డులోని ఆ భవనంతో పాటుగా మిగిలినచోట్ల తనిఖీ చేస్తున్నారు. అలాగే కాల్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ బెదిరింపు కాల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పామర్రులో యువకుడి ఆత్మహత్య
కృష్ణా జిల్లా పామర్రులో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. కొబ్బరితోట ప్రాంతానికి చెందిన కుంభ నాగరాజు బోర్లు తీసే పనిచేస్తూ జీవిస్తుంటాడు. నాగరాజు తండ్రి కొన్నేళ్ల కిందట చనిపోయారు.. ఈ క్రమంలో తల్లి నాగమణితో విభేదాలు వచ్చాయి.. ఆమెతో గొడవ పడుతున్నాడు. నాగరాజు 15 రోజుల నాడు పామర్రు నుంచి గుడివాడలో తన అత్త వారింటికి వెళ్లి అక్కడ భార్యతో కలిసి ఉంటున్నాడు. రెండు రోజుల కిందట పనికి వెళ్లేందుకు సొంత ఊరు పామర్రులోని తన ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో గురువారం రాత్రి తన ఇంట్లో చీరతో ఉరేసుకుని కనిపించాడు. పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తని హత్య చేసి ఉరిగా చిత్రీకరించారని భార్య ఆరోపిస్తున్నారు.. ఈ మేరకు ఆమె ధర్నాకు దిగారు. అయితే తాను దివ్యాంగురాలినని.. తనకు, బిడ్డలకు న్యాయం చేయాలని కోరుతున్నారు నాగరాజు భార్య కనకదుర్గాభవాని. తన అత్తపై అనుమానాలు వ్యక్తం చేశారు. రెండు రోజుల కిందట నాగరాజు పామర్రు వెళ్లాడని.. అక్కడ ఉరివేసి చంపారని.. తన అత్త నాగమణి, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి, అతని భార్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విజయవాడతో పాటుగా సమీప ప్రాంతాల్లో ఎన్ఐఏ,సెంట్రల్ ఇంటిలిజెన్స్, పోలీసులు జరిపిన తనిఖీల్లో బంగ్లాదేశీయులు, మయన్మార్‌కు చెందిన వారు దొరికిపోయారు. పెనమలూరులో ఓ టైలర్ షాపు పెట్టుకునే స్థోమత లేక.. వినూత్నంగా బైక్‌పైనే షాపును ఓపెన్ చేశారు. విజయవాడలో రోడ్డుపై ఓ జంట రెచ్చిపోయింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.