Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!

15 April 2026

House: ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి.. లేదంటే గాలికి వదిలేసినట్టే.!

15 April 2026

జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!! | YS Jagan announces his support for Juvvaledinne Fishermen on fishing Harbour, Warns AP Govt

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»విశాఖలో ఇరాన్ మహిళల కన్నీటి కష్టం.. బతుకు భారంతో ఆవేదన.. అయినవాళ్ల కోసం ఆందోళన..
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఇరాన్ మహిళల కన్నీటి కష్టం.. బతుకు భారంతో ఆవేదన.. అయినవాళ్ల కోసం ఆందోళన..

.By .9 April 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
విశాఖలో ఇరాన్ మహిళల కన్నీటి కష్టం.. బతుకు భారంతో ఆవేదన.. అయినవాళ్ల కోసం ఆందోళన..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖలో ఇరాన్ మహిళల కన్నీటి కష్టం.. బతుకు భారంతో ఆవేదన.. అయినవాళ్ల కోసం ఆందోళన..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు ఆ ఇరానియన్ అక్కాచెల్లెళ్లను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి.. ఉన్నత చదువుల కోసం విశాఖ వచ్చిన వారిని యుద్ధ ప్రభావం దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. చేతిలో డబ్బుల్లేవు.. అయిన వాళ్ళు తమ దేశంలో ఎలా ఉన్నారో తెలియదు.. ఫీజులు, అద్దె అంతా ఇరాన్లో ఉన్న కుటుంబం పైనే ఆధారం. కానీ ఇప్పుడు వారి నుంచి కమ్యూనికేషన్ లేదు. ఆర్ధిక పరిస్థితులు ఒకవైపు.. తమ వాళ్ళు ఎలా ఉన్నారో తెలియక ఆందోళన మరోవైపు.. దీంతో విశాఖలో ఎలా బతకాలి.. ఇరాన్ ఎలా వెళ్లాలి..? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు ఇరానియన్ సిస్టర్స్. బతుకు భారమైన తమను ఆదుకోవాలి అంటూ అధికారులను సంప్రదించారు.

ఇరాన్ కు చెందిన జీనాబ్ మొహమ్మది, సోల్మాజ్ మహమ్మదీ సిస్టర్స్.. డి ఫార్మసీ చదివేందుకు విశాఖ వచ్చారు. తమతో పాటు ముగ్గురు పిల్లలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళ చదువులు అయ్యేంతవరకు ఆ పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. మరో రెండు నెలల్లో వీరి ఇంటర్న్ షిప్ కంప్లీట్ అవుతుంది. హ్యాపీగా సర్టిఫికెట్లు పట్టుకొని తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు.. సిద్ధమవుతున్న సమయంలో ఇరాన్ పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు వీరిని కష్టాల్లోకి నెట్టేసాయి. ఇరాన్ లో ఉన్న కుటుంబంతో పది రోజుల నుంచి కమ్యూనికేషన్ లేదు. జీనాద్ సోల్మాస్ విశాఖలో అయ్యే ఖర్చు ఎంత కుటుంబమే అక్కడ నుంచి పంపించేది. కానీ యుద్ధం మొదలైన తర్వాత.. అక్కడ ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో యుద్ధ పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబ సభ్యులు విశాఖలో ఉన్న జీనాబ్, సొల్మాజ్ కు ఖర్చులకోసం నగదు పంపలేకపోయారు. దీంతో అప్పటినుంచి విశాఖలో ఉంటున్న ఈ ఇరానియన్ సిస్టర్స్ కష్టాలు పెరిగాయి. చేతిలో ఉన్న డబ్బు అంతా ఖర్చయింది. ఆర్థిక కష్టాలు విరికి పెరిగాయి.

అధికారులను కలిసి… గోడు వెళ్ళబోసుకొని..

సోల్మాజ్ కుటుంబ సభ్యులు ఇరాన్‌లో వ్యాపారం చేస్తున్నారు. జీ నాకు కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అందకపోవడంతో విశాఖలో ఉంటున్న ఇద్దరు సిస్టర్స్ కష్టాలు మరింత పెరిగాయి. రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలతో పోషణ కష్టంగా మారింది. నిస్సహాయ స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని వారు అధికారులను కోరారు. కలెక్టరేట్ కు చేరుకొని డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రాన్ని సమర్పించారు. తమ కష్టాన్ని చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. తమను ఆదుకోవాలని విన్నవించారు. వారి దయనీయ స్థితిని చూసిన అధికారులు స్పందించి భరోసా కల్పించారు.

Iran Womens

Iran Womens

మా కుటుంబాలతో కమ్యూనికేషన్ లేదు..

ఇద్దరు ఇరానియన్ సిస్టర్స్ టీవీ9 ఎదుట తమ గోడును వెళ్ళబోశారు. ‘‘డి ఫార్మసీ చదివేందుకు ఇక్కడికి వచ్చాం.. మా ఇద్దరికీ ముగ్గురు చిన్న పిల్లలు..ఇరాన్ లో యుద్ధ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పది రోజులుగా మా కుటుంబాలతో కమ్యూనికేషన్ లేదు. వాళ్లు ఎలా ఉన్నారో ఏమయ్యారో కూడా అర్థం కావడం లేదు. మేం వారిపైనే ఆధారపడి ఇక్కడ ఉంటున్నాం. అక్కడ యుద్ధ పరిస్థితుల తర్వాత ఇక్కడ మా పరిస్థితి దయానియంగా మారింది. మరో రెండు నెలల్లోనే మా కోర్సు పూర్తికాగానే ఇరాన్ వెళ్ళిపోవాలనుకున్నాం. ఇంతలో యుద్ధంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల క్రితం వరకు కుటుంబంతో కమ్యూనికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారో ఏమయ్యారో కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ సాధారణ జీవనానికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఇక్కడ మాకు ఎవరూ లేరు.. ఉన్న డబ్బు కూడా పూర్తిగా అయిపోయింది. ఇంటి అద్దె రెండు నెలలు చెల్లించాలి.. పిల్లల స్కూలు ఫీజు కూడా భారంగా మారింది. పిల్లలతో వారి పోషణ కూడా కష్టంగా ఉంది. నిస్సహాయ స్థితిలో ఉన్నాం.. ప్రభుత్వం ఆదుకోవాలి. భారత ప్రభుత్వం సాయం చేస్తుందని నమ్మకంతో ఉన్నాం..’’ అని ఆవేదనతో అన్నారు జీనాబ్..

వీడియో చూడండి..

వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాం..

ముగ్గురు పిల్లలు పీఎం పాలెం లోని ఓ స్కూల్లో చదువుతున్నారు. రెండు నెలలుగా ఆర్థిక భారంతో పిల్లల ఫీజులు చెల్లించడం కూడా వారికి కష్టతరంగా మారింది. ప్రస్తుతం వారి దయనీయ పరిస్థితిని చూసి పెద్ద మనసు చాటుకున్నారు స్కూలు నిర్వాహకులు. అతిథిగా మన దేశానికి వచ్చిన వారిని.. మానవత్వంతో నైతిక మద్దతు నిచ్చేలా పిల్లలను అక్కున చేర్చుకున్నారు. ‘ మా దగ్గరే పిల్లలు చదువుతున్నారు.. ఏనాడూ ఫీజులను వాళ్ళు చెల్లించకుండా ఉండలేదు.. ఈ మధ్యయుద్ధ పరిస్థితులలో వాళ్లు కష్టాల్లో పడ్డారు.. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాం. ఈ సమయంలో వారికి మానవత్వంతో అందరూ సహకారం అందించాల్సిన అవసరం ఉంది.’ అని పెద్ద మనసుతో అన్నారు పాఠశాల ప్రిన్సిపల్ అనుపమ..

అధికారుల నుంచి భరోసా..

బాధిత మహిళల ఇబ్బందుల్ని కలెక్టర్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు అధికారులు. ఇరానియన్ సిస్టర్స్ నివాసముంటున్న ఇంటి యజమాని, చదువుతున్న విద్యాసంస్థ డైరెక్టర్ తో మాట్లాడి తగిన సహకారం అందించాలని సూచించారు. వీలైనంత వరకు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TTD fake Darshan Ticket Gang: శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్

15 April 2026

Ttd To Rename Tirumala Streets Very Soon,తిరుమలలో వీధులకు కొత్త పేర్లు.. టీటీడీ కీలక నిర్ణయం, పూర్తి వివరాలివే – ttd proposed new names for few streets and roads in tirumala soon reports

15 April 2026

Kadiri Gas Cylinder Blast In A House,కదిరిలో ఘోర ప్రమాదం.. ఓ ఇంట్లో పేలుడు, నలుగురు మృతి.. 10మందికిపైగా తీవ్ర గాయాలు – gas cylinder blast in a house at kadiri sri sathya sai district

15 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!

15 April 2026

తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో విజయ్ దళపతి దూసుకుపోతున్నాడు. తను కవర్ చేయని ఏరియాలను AI టెక్నాలజీ సాయంతో చుట్టేస్తూ…

House: ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి.. లేదంటే గాలికి వదిలేసినట్టే.!

15 April 2026

జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!! | YS Jagan announces his support for Juvvaledinne Fishermen on fishing Harbour, Warns AP Govt

15 April 2026

Swarna Kamalam Movie : వెంకీ కెరీర్ మలుపు తిప్పిన సినిమా.. స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..

15 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!

15 April 2026

House: ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి.. లేదంటే గాలికి వదిలేసినట్టే.!

15 April 2026

జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!! | YS Jagan announces his support for Juvvaledinne Fishermen on fishing Harbour, Warns AP Govt

15 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025451

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.