Kadiri Gas Cylinder Blast: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కమ్మరవాండ్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. 10మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల జరిగిందా లేదా జిలిటిన్ స్టిక్స్ వల్ల జరిగిందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
హైలైట్:
- శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఘోర ప్రమాదం
- ఓ ఇంట్ల ోపేలుడు.. అక్కడే నలుగురు మృతి
- పేలుడుకు కారణాలపై ఆరా తీస్తున్నారు

వెంకన్న (45)గా గుర్తించారు.ఈ పేలుడు దెబ్బకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.. ఆ పక్కనే ఉన్న మరికొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఇంట్లో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలినట్లు అక్కడ పరిస్థితులు చూస్తే అర్ధమవుతోంది.. కానీ ఈ పేలుడుకు జిలిటిన్ స్టిక్స్ కారణమనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేలుడు సంభవించిన ఇంట్లో పేలుడు పదార్థాలు అమర్చేందుకు ఉపయోగించే డ్రిల్లింగ్ మెషిన్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


