తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్ జూన్ 2026) తొలివిడత నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 13న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్ కన్వీనర్ రమేశ్ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను జారీ చేశారు. బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో సర్వీసులో ఉన్న టీచర్లు.. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించవల్సి ఉంటుంది. ఇక టెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 15, 2026వ తేదీ నుంచి ప్రారంభం అవనున్నాయి. టెట్‌లో ఒక్కసారి అర్హత సాధిస్తూ లైఫ్‌టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది.
తెలంగాణ టెట్ జూన్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టెట్‌కు ఏయే అర్హతలు ఉండాలంటే?
టెట్ పరీక్ష రెండు పేపర్లకు ఉంటుంది. పేపర్ 1 పరీక్ష ప్రాథమిక పాఠశాలలలో 1 నుంచి 5వ తరగతులకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారికి ఉంటుంది. పేపర్ 2 పరీక్ష ఉన్నత ప్రాథమిక పాఠశాలలలో 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునే వారికి నిర్వహిస్తారు. పేపర్ 1కు ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే D.El.Ed లేదా D.Ed (స్పెషల్ ఎడ్యుకేషన్)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. పేపర్ 2 పరీక్షకు ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీనితోపాటు పాటు బీఎడ్/ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. భాషా పండిట్ పోస్టులకు సంబంధిత ల్వాంగ్వేజ్ డిగ్రీతోపాటు పండిట్ ట్రైనింగ్ ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా టెట్ పరీక్ష రాయవచ్చు. టెట్ పరీక్ష రాసేందుకు ఎలాంటి పరిమితి ఉండదు. కాబట్టి గతంలో టెట్ ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరును మెరుగుపరుచుకోవడానికి మళ్ళీ రాయవచ్చు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ టెట్ జూన్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా దరఖాస్తు చేయాలంటే?
ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి టెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులందరూ ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.వెయ్యి చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజును తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు మాత్రం రూ.50 మినహాయింపు ఉంటుంది. ఇక టెట్ ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 15 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. హాల్ టికెట్లు జూన్ 9, 2026వ తేదీన విడుదల చేస్తారు. మొత్తం 150 మార్కులకు టెట్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో కేటగిరీ వారీగా కనీస అర్హత మార్కులు సాధించవల్సి ఉంటుంది. ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు 60 మార్కులు చొప్పున సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. టెట్ పరీక్ష అనంతరం ఫలితాలను జులై 28 నుంచి 31 మధ్య విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణ టెట్ జూన్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.

