Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!

14 April 2026

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి ఓడిన కోల్‌కతా

14 April 2026

మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? | china Unveils New Four-Point Peace Plan to Mediate Growing Tensions Between United States and Iran

14 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Inter Results 2026,AP Inter 1st, 2nd Year Result 2026: ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి.. – andhra pradesh inter results 2026 live updates how to check your 1st year and 2nd year results on whatsapp full details here
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Inter Results 2026,AP Inter 1st, 2nd Year Result 2026: ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి.. – andhra pradesh inter results 2026 live updates how to check your 1st year and 2nd year results on whatsapp full details here

.By .14 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Inter Results 2026,AP Inter 1st, 2nd Year Result 2026: ఏపీలో రేపే ఇంటర్ ఫలితాలు విడుదల.. వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి.. – andhra pradesh inter results 2026 live updates how to check your 1st year and 2nd year results on whatsapp full details here
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఉదయం పది గంటల 31 నిమిషాలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌తో పాటుగా.. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు.

AP inter results
ఏపీ ఇంటర్ ఫలితాలు(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను రేపు (ఏప్రిల్‌ 15) వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. బుధవారం ఉదయం 10.31గంటలకు ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల కానున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను https://resultsbie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అలాగే మనమిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు పొందొచ్చని తెలిపారు. ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు జరిగిన సంగతి తెలిసిందే.

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

మరోవైపు వెబ్‌సైట్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలు చూడాలనుకుంటే.. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.inను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం రిజల్ట్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం విద్యార్థికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, వివరాలు నమోదు చేస్తే.. ఇంటర్ ఫలితాలు తెలుస్తాయి.

మనమిత్ర వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా కూడా ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌లో 9552300009 నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి. అనంతరం మెనూ వస్తుంది. అందులో సెలెక్ట్ సర్వీస్‌లో విద్యా సేవలు అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీ ఇంటర్ ఫలితాలు 2026ను ఎంచుకోవాలి. ఎంచుకున్న అనంతరం హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.

మరోవైపు ఇటీవలే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ప్రకటించారు. తాజాగా ఏపీలోనూ ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో గతేడాది బాలికలు పైచేయి సాధించారు. అలాగే మొదటి సంవత్సరం 70 శాతం, రెండో సంవత్సరం 83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 2025 ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు టాప్ త్రీలో నిలిస్తే… ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో అల్లూరి జిల్లా, సెకండియర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా ఆఖరి స్థానంలో నిలిచాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి