డయాబెటిస్ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఆహారంలో నూనె, మసాలా దినుసులకు బదులుగా పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
అయితే ఈ కింది రుచికరమైన ఆహారాలు కడుపు నిండా తినడం వల్ల కూడా రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా ఓట్స్, బ్రౌన్ బ్రెడ్‌తో చేసిన శాండ్‌విచ్ తినడం పూర్తిగా సురక్షితం. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి కారణం కాదు.
డయాబెటీస్‌తో బాధపడేవారు తీపి పదార్థాలను పూర్తిగా మానుకోవడం కష్టం. కాబట్టి శనగలతో చేసిన పొడి మిఠాయిలను ఎంచుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం లేదా స్టీవియాతో చేసిన మిఠాయిలు ఇప్పుడు మార్కెట్లో సులభంగా లభిస్తున్నాయి. మీరు వాటిని కూడా ప్రయత్నించవచ్చు.
ఈ వేసవిలో శీతల పానీయాలు లేదా ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండటం మంచిది. బదులుగా దాహాన్ని తీర్చుకోవడానికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం (పంచదార లేకుండా) తాగొచ్చు. తాజా పెరుగుతో చేసిన రైతా కూడా తీసుకోవచ్చు. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
వేసవిలో శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుకోవడానికి తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు మధ్యాహ్నం కొంచెం ఎక్కువగా తిన్నట్లయితే సాయంత్రం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. శారీరక శ్రమ రక్తంలో పేరుకుపోయిన అదనపు గ్లూకోజ్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది.





