Chennai Super Kings vs Kolkata Knight Riders: ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
సంజు సామ్సన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ 29 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఆయుష్ మహాత్రే 17 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. కేకేఆర్ తరపున కార్తిక్ త్యాగి రెండు వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
రెండు జట్లు..
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, డెవాల్డ్ బ్రూయిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, గుర్జప్నీత్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్లు: మాథ్యూ షార్ట్, అకేల్ హొస్సేన్, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, మాట్ హెన్రీ.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా.
ఇంపాక్ట్ ప్లేయర్లు: ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి సింగ్, నవదీప్ సైనీ, టిమ్ సీఫెర్ట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

