Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఏపీ ఉక్కిరిబిక్కిరి: నడివేసవికి ముందే 45 డిగ్రీలు | Kadapa, Kurnool and Nandyal Records Scorching Heat Waves at 45 Degrees Celsius in Vontimitta

15 April 2026

Team India: టీమిండియాలోకి వైభవ్ ఎంట్రీ.. కట్‌చేస్తే.. సచిన్ రికార్డ్‌కే ఎసరు పెట్టేశాడుగా?

15 April 2026

AP Inter Results 2026: వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ ఒక్క మెస్సేజ్ పెడితే సెకన్లలోనే మీ ముందుకు..

15 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Liqour Sales In Srisailam Temp;e,శ్రీశైలంలో మద్యం, సారా విక్రయాలు.. బస్సులలో తెచ్చి అమ్ముతున్న మహిళలు – women illegally selling liquor arrest in srisailam
ఆంధ్రప్రదేశ్

Liqour Sales In Srisailam Temp;e,శ్రీశైలంలో మద్యం, సారా విక్రయాలు.. బస్సులలో తెచ్చి అమ్ముతున్న మహిళలు – women illegally selling liquor arrest in srisailam

.By .15 April 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Liqour Sales In Srisailam Temp;e,శ్రీశైలంలో మద్యం, సారా విక్రయాలు.. బస్సులలో తెచ్చి అమ్ముతున్న మహిళలు – women illegally selling liquor arrest in srisailam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అక్రమంగా మద్యం, నాటుసారా విక్రయిస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుల ద్వారా మద్యం, నాటుసారాను అక్రమంగా తీసుకువచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన ఐదుగురు మహిళలు శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులలో అక్రమంగా మద్యం, నాటుసారా తీసుకువచ్చి.. ఆర్టీసీ బస్టాండ్, మాణిక్యమ్మపెల్ల, సిద్ధ రామప్ప కాంప్లెక్స్ ప్రాంతాల సమీపంలో విక్రయిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐదుగురు మహిళలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి 314 క్వార్టర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.

Srisailam
శ్రీశైలంలో మద్యం అమ్ముతున్న మహిళలు(ఫోటోలు– Samayam Telugu)
పవిత్ర పుణ్య క్షేత్రం శ్రీశైలంలో నాటుసారా, మద్యం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రం పవిత్రతను కాలరాస్తూ కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా మద్యం, నాటుసారా విక్రయాలు సాగిస్తున్నారు. కొంతమంది మహిళలు ముఠాగా ఏర్పడి ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. మద్యం దందా గుట్టును రట్టు చేశారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నుంచి మద్యం. నాటుసారాను బస్సులలో తీసుకొచ్చి శ్రీశైలంలో అమ్ముతున్న ఐదుగురు మహిళలను పోలీసులు మంగళవారం(ఏప్రిల్ 14) అరెస్ట్ చేశారు. వీరి నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

కొంతమంది మహిళలు శ్రీశైలానికి అక్రమంగా మద్యాన్ని తరలించి.. అక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆర్టీసీ బస్టాండ్, సిద్ధ రామప్ప కాంప్లెక్స్, మాణిక్యమ్మపెల్ల ప్రాంతంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి 314 క్వార్టర్ల మద్యం బాటిళ్లను, 24 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. భక్తుల రద్దీని అవకాశంగా చేసుకుని అనుమానం రాకుండా అక్రమంగా మద్యం తరలింపు, విక్రయాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు శ్రీశైలం లోని హోటల్స్‌లో పని చేసే సిబ్బందిని టార్గెట్‌గా చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఓ ప్రముఖ హోటల్ సిబ్బందికి క్రమం తప్పకుండా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. అలాగే శ్రీశైలంలోని పలు పాయింట్ల దగ్గర ఈ మహిళలు అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. మద్యం ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారనే దానిపైనా విచారణ జరుపుతున్నారు. మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం విక్రయాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని.. ఈ దందా వెనుక ఉన్న వారిని గుర్తించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉన్న పవిత్రతను కాపాడాలని అధికారులు, పోలీసులకు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.

వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.… ఇంకా చదవండి