Anakapalle Renew Energy Plant With Rs 5400 Crore,అనకాపల్లి జిల్లాలో మరో భారీ పరిశ్రమ.. రూ.5,400 కోట్ల పెట్టుబడి, ‘రెన్యూ’ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాన – ap cm chandrababu laid foundation stone for renew energy solar manufacturing plant worth rs 5400 crore in rambilli anakapalle district
Anakapalle ReNew Energy Plant With Rs 5400 Crore: అనకాపల్లి జిల్లాకు మరో భారీ పరిశ్రమ వచ్చింది. రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ సంస్థ ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని.. వరుసగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా దేశంలోనే నంబర్ వన్‌గా తయారవుతుందన్నారు.
హైలైట్:
అనకాపల్లి జిల్లాలో మరో భారీ పరిశ్రమకు శంకుస్థాపన
రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు
రాంబిల్లిలో 6.5 గిగావాట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థ ప్లాంట్
అనకాపల్లి జిల్లా రెన్యూ ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన(ఫోటోలు– Samayam Telugu)
ఉత్తరాంధ్రకు వరుసగా పరిశ్రమలు క్యూ కట్టాయి.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా అడుగు పెడుతున్నాయి. ఇటీవలే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయగా.. తాజాగా మరో పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా.. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది. మొత్తం రూ.5,400 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్ట్ ద్వారా2,100 మందికి ఉపాధి లభించనుంది. అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందని.. పెట్టుబడుల్లో ఈ జిల్లా భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న రంగారెడ్డి ఇప్పుడు సంపద కలిగిన ప్రాంతంగా అభివృద్ధి చెందిందన్నారు. గడచిన 22 నెలల్లో 802 ఎంయూలు చేసుకున్నామని.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనుమతులు ఇస్తున్నామన్నారు.కేంద్ర మాజీమంత్రి దివంగత యశ్వంత్ సిన్హా కుమారుడు ఈ సోలార్ వేఫర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని.. సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెన్యూ ఎనర్జీ వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇప్పటికే సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి జరుగుతోందని.. రాంబిల్లిలో సోలార్ ప్యానల్స్ తయారుకాబోతున్నాయన్నారు చంద్రబాబు. రాష్ట్రంలోని ప్రతీ ఇంటిపైనా విద్యుత్ ఉత్పత్తి కోసం పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 40 లక్షల ఇళ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతులు కూడా పీఎం కుసుమ్ కింద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ఎక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్ అక్కడే వాడుకునే పరిస్థితి ఉంటే ట్రాన్స్ మిషన్ నష్టాలు కూడా ఉండవని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ పాలనలో విద్యుత్ ఛార్జీలను ట్రూ ఆప్ చేస్తే.. తాము అధికారంలోకి వచ్చాక ట్రూ డౌన్ చేశామన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.4,600 కోట్ల మేర భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తోందని.. రూ.15,795 కోట్లు ఛార్జీల భారం పెంచకుండా ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఈ రంగంలో రూ.5.95 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఈవీ వాహనాలు తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని.. ఆర్టీసీ కూడా 1,050 బస్సులు తీసుకువస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ నెల 28 తేదీన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నామని ప్రకటించారు చంద్రబాబు. జులైలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోందని.. లారస్ ల్యాబ్ 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకు వస్తోందన్నారు. విశాఖపట్నం ఉక్కును కాపాడుకున్నామని.. రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం మధ్య నాలుగు రైల్వే లైన్లు రాబోతున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేశామని.. పోలవరాన్ని కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగ, ఉపాధి కోసం ఎవరూ బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2018లో సమయంలో చేరిన తిరుమల బాబు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణలు రాస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, తిరుమల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. తెలంగాణ, జాతీయ వార్తలు సైతం ఆయన రాస్తుంటారు. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. 2024 ఏపీ ఎన్నికల కవరేజీలో అత్యుత్తమ పనితీరు కనబర్చినదుకు గానూ తిరుమల బాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.
తిరుమల బాబు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఎన్టీవీ, సాక్షి మీడియా, టీవీ5 సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, బుక్స్ చదడానికి ఆయన ఇష్టపడతారు.… ఇంకా చదవండి