చాలా మందికి భక్తిపాటలు స్టేటస్ పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా కొందరు నిత్యం తమకు ఇష్టమైన భక్తి పాటను స్టేటస్‌గా పెట్టుకుంటారు. ఇక మంగళ వారం రోజు మాత్రం తప్పకుండా శ్రీ ఆంజనేయం సినిమాలోని రామ రామ జయరామ అనే పాట మాత్రం స్టేటస్‌లలో మార్మోగిపోతుంది. అంతే కాకుండా ఈ పాట వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది.
శ్రీ ఆంజనేయం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఇది చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ మూవీ 2004 జూలై 24న సోషియో ఫాంటసీ విధంగా విడుదలైంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్, చార్మి కౌర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో చాలా మంది సీనియర్ స్టార్ నటీనటులు నటించారు.
ముఖ్యంగా హీరో అర్జున్ సర్జా, స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందించారు, కృష్ణ వంశీనే ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. రామాపురం అనే గ్రామంలో, సీతమ్మ తల్లి చెక్ డ్యాం ఆనకట్ట నిర్మించే క్రమంలో ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ మరణిస్తారు. వీరి కుమారుడు నితిన్ హీరో, ఆంజనేయ స్వామి భక్తుడు. నిత్యం ఆంజనేయ స్వామి జంప చేస్తూ ఉంటాడు.
ఇక ఈ మూవీలో ప్రతి సాంగ్ మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా రామ రామ రఘురామ అనే సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇకఈ పాట మల్లికార్జున్ పాడగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రీ రాశారు, ఈ పాట మొత్తం హనుమంతుడి భక్తిని, రామడి భక్తిని తెలియజేస్తుంది. ఈ పాటకు మణి శర్మ సంగీతం అందించారు.
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.. అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఈ పాట చాలా మందికి ఇప్పటికీ ఫేవరెట్. ముఖ్యంగా మంగళ వారం వస్తే చాలు హనుమంతుడి భక్తులు ఎక్కువగా ఈ పాటను స్టేటస్ రూపంలో పెట్టుకొని, తమ భక్తిని చాటుకుంటారు. అంతే కాకుండా ఇప్పటికీ ఎక్కడ చూసినా, ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.






